iDreamPost
android-app
ios-app

ట్రోల్స్ పై మొదటసారి స్పందించిన అవంతిక.. ఏం చెప్పిందంటే

  • Published Mar 16, 2024 | 10:32 AM Updated Updated Mar 16, 2024 | 10:57 AM

టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు ఇటీవలే హలీవుడ్ సినిమా మీన్ గార్ల్స్ తో సెన్సెషన్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రమోషన్స్ భాగంగా అవంతిక మాట్లాడిన తీరు పై దారుణమైన ట్రోల్స్ జరిగాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవంతిక తన పై వచ్చిన ట్రోల్స్ కు స్పందించి ఏకంగా అలా అనేసింది.

టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు ఇటీవలే హలీవుడ్ సినిమా మీన్ గార్ల్స్ తో సెన్సెషన్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రమోషన్స్ భాగంగా అవంతిక మాట్లాడిన తీరు పై దారుణమైన ట్రోల్స్ జరిగాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవంతిక తన పై వచ్చిన ట్రోల్స్ కు స్పందించి ఏకంగా అలా అనేసింది.

  • Published Mar 16, 2024 | 10:32 AMUpdated Mar 16, 2024 | 10:57 AM
ట్రోల్స్ పై మొదటసారి స్పందించిన అవంతిక.. ఏం చెప్పిందంటే

టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ ‘అవంతిక వందనపు’. గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఈమె పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. కాగా, అవంతిక మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో బాలనటిగా మెరిసింది. కానీ, ఇప్పుడు మాత్రం ఏకంగా హాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది. అక్కడే వరుస ఆఫర్స్ తో ఈ చిన్నది హాలీవుడ్ నటీనటులకు పోటీనిస్తుంది. అతి చిన్న వయసులోనే తెలుగు సినిమాలు, కమర్షియల్ యాడ్స్ చేసి ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కొన్నాళ్లపాటు మీడియాకు దూరంగా ఉంది. ఆ తర్వాత సడెన్‏గా హాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక్షమయ్యింది. కాగా, ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మీన్ గార్ల్స్’. ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో అవంతిక ఇంటర్వ్యూలపై నెట్టింట దారుణంగా ట్రోలింగ్ కు గురైన విషయం తెలిసిందే. అయితే తాజాగా అవంతిక తనపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించి పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేసింది.

చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక ఇటీవలే ‘మీన్ గార్ల్స్’ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై మంచి సూపర్ హిట్ సక్సెస్ ను అందుకుంది. ముఖ్యంగా.. ఇందులో అవంతిక యాక్టింగ్ అక్కడున్నవారిని బాగా ఆకట్టుకుంది. ఇక ఇదే సినిమాలో అవంతిక చేసిన స్పెషల్ సాంగ్ కు మంచి హిట్ అవ్వడంతో.. ఈమె పేరు నెట్టింట సెన్సెషన్ గా అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా అమెరికాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే.. మీన్ గార్ల్స్ సినిమా ప్రమోషన్స్ సమయంలో.. అవంతిక అమెరికన్ ఆక్సెంట్.. ఫేస్ ఎక్స్‏ప్రెషన్స్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరిగింది. అయితే, తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అమెరికన్ ఆక్సెంట్ లో మాట్లాడుతుంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఆ సమయంలో మీరు ఎలా ఫీలయ్యారు అనే ప్రశ్న ఎదురైంది. దాని గురించ అవంతిక మాట్లాడుతూ.. ‘నాకు అసలు అర్ధం కావడం లేదు. నేను అమెరికలో పుట్టి పెరిగాను. మేము స్కూల్ కు వెళితే ఇంగ్లీష్ ఆక్సెంట్ మాట్లాడతాము. అలాగే,అమ్మ నాన్నతో ఇండియన్ ఇంగ్లీష్ ఆక్సెంట్ తో మాట్లాడతాము. దీనిని కోడ్ స్విచ్చింగ్ అంటారు. కానీ, ఈ విషయం చాలామందికి అర్ధం కాలేదని నాకు ఇప్పుడు తెలిసింది. అందుకే అందరూ ఇలా ట్రోల్స్ చేశారు. ఇలా ఎందుకు మాట్లాడుతుంది అంటున్నారు. అది నా న్యాచురల్ ఆక్సెంట్’ అని అవంతిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అవంతిక చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

Avantika reacts to trolls

ఇక తెలుగు కుటుంబానికి చెందిన అవంతిక 2005లో కాలిఫోర్నియాలో జన్మించింది. అక్కడే చదువుతోపాటు యాక్టింగ్ శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత చిన్న వయసులోనే..పలు కమర్షియల్ యాడ్స్ సినిమాలో కనిపించింది. ఇక హాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో కనిపించిన ఈ చిన్నది.. మీన్ గార్ల్ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. మరి, ఇంటర్వ్యూలో అవంతిక తన పై వచ్చే ట్రోలింగ్స్ కు చేసే కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletMadridbet girişMadridbet girişMadridbetmeritbetCasibom GirişmeritbetsuperbetinTophillbetJojobet GirişcasibomCasibom GirişHoliganbetgalabetHoliganbetMarsbahis GirişCasibomJojobetHoliganbetJojobet