iDreamPost
android-app
ios-app

కేరళ వరదలు.. చిరంజీవి- రామ్ చరణ్ కోటి విరాళం

కేరళలో ప్రకృతి ప్రకోపానికి వయనాడ్ జిల్లాలోని నాలుగు గ్రామాలు తుడుచుకుపెట్టుకుపోయాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ ఆర్థికంగా చేయూతనిస్తుంది. మాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్ కూడా ..

కేరళలో ప్రకృతి ప్రకోపానికి వయనాడ్ జిల్లాలోని నాలుగు గ్రామాలు తుడుచుకుపెట్టుకుపోయాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ ఆర్థికంగా చేయూతనిస్తుంది. మాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్ కూడా ..

కేరళ వరదలు.. చిరంజీవి- రామ్ చరణ్ కోటి విరాళం

కేరళలో వరద భీభత్సం సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. వయనాడ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ విపత్తు మాటలకు అందని విషాదం. అయిన వారిని పోగొట్టుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎటు చూసినా శవాల గుట్టలే. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు లభ్యమౌతున్నాయి. బురదలో, శిథిలాల కింద కూరుకుపోయారు. నాలుగు గ్రామాలు వల్లకాడుగా మారాయి. ప్రకృతి ప్రకోపాన్ని జాతీయ విపత్తుగా చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 300 మందికి పైగా మరణించారు. అలాగే 200 మందికి పైగా గల్లంతు అయినట్లు తెలుస్తుంది. అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ఎఫ్, ఆర్మీ దళాలు రెస్య్కూ ఆపరేషన్ చేపడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కదులుతుంది.

వరదలకు కొండచరియలు విరిగిపడి వయనాడ్‌ను ముంచెత్తిన రోజే నిఖిలా విమల్ సోషల్ మీడియాకు పరిమితం కాకుండా రంగంలోకి దిగి.. వాలంటీర్ అవతారం ఎత్తి.. బాధితులకు పంపాల్సిన వస్తు సామాగ్రి ప్యాక్ చేసింది. కాగా, ఆ తర్వాత కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు స్పందించడంతో పాటు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ నటుడు విక్రమ్ రూ. 20 లక్షలు, స్టార్స్ ఫ్యామిలీ సూర్య, జ్యోతిక, కార్తీలు రూ. 50 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. అలాగే రష్మిక మందన్న రూ. 10 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత మాలీవుడ్ నటులు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ రూ. 35 లక్షలు ప్రకటించారు. నయన్ తార, విఘ్నేష్ శివన్ కూడా తమ వంతు సాయాన్ని అందించారు. ఇక మోహన్ లాల్ అయితే కల్నల్ హోదాలో వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అలానే రూ. 3 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు.

మాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా తన పెద్ద మనస్సును చాటుకుంటుంది. సితార ఎంటర్ టైన్‌మెంట్ బ్యానర్ అదినేత నాగ వంశీ సూర్యదేవర రూ. 5 లక్షలు ప్రకటించారు. తాజాగా అల్లు అర్జున్ తన వంతు సాయంగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ ఇద్దరు కలిసి కోటి రూపాయలను కేరళ సీఎం రిలీఫ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు చిరంజీవి. అలాగే తన సానుభూతికి వ్యక్తం చేశారు. ‘ కేరళలో ప్రకృతి ప్రకోపం వల్ల జరిగిన విధ్వంసం, వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యా. వయనాడ్ దుర్ఘటన చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చరణ్‌, నేను కలిసి రూ.1 కోటి విరాళంగా అందజేస్తున్నాం. బాధలో ఉన్న వారందరూ కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు చిరు.