iDreamPost

Chandini Chowdary: ఆడవాళ్ళను.. మగాళ్ళు ఎందుకు క్యారెక్టర్ లేని వాళ్లలా చూస్తారు? చాందిని చౌదరి షాకింగ్ కామెంట్స్..

యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆడవాళ్ళను.. మగాళ్ళు ఎందుకు క్యారెక్టర్ లేని వాళ్లలా చూస్తారు? అంటూ ఆమె ప్రశ్నించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆడవాళ్ళను.. మగాళ్ళు ఎందుకు క్యారెక్టర్ లేని వాళ్లలా చూస్తారు? అంటూ ఆమె ప్రశ్నించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Chandini Chowdary: ఆడవాళ్ళను.. మగాళ్ళు ఎందుకు క్యారెక్టర్ లేని వాళ్లలా చూస్తారు? చాందిని చౌదరి షాకింగ్ కామెంట్స్..

సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళకు తగిన గౌరవం ఉండదని, వారికి తగినంత గుర్తింపు కూడా ఉండదని ఎంతో మంది సీనియర్, యంగ్ యాక్టర్స్ బాహాటంగానే తమ ఆవేదనను చెప్పారు. రెమ్యూనరేషన్ విషయంలో కూడా హీరోలతో పోలిస్తే.. హీరోయిన్లకు తక్కువ ఇస్తారని వారు చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. ఇక ఇదే విషయంపై ఓ అడుగు ముందుకేసి ఓ ప్రశ్న వేసింది యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి. ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే ఆడవాళ్లను.. మగాళ్లు ఎందుకు క్యారెక్టర్ లేని వారిలా చూస్తారు? అంటూ సూటిగా ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

చాందిని చౌదరి.. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. వరుసగా సినిమాలు చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తోంది. కలర్ ఫొటోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఈ సంవత్సరంలో ఇప్పటికే మూడు సినిమాల్లో నటించింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రయోగాత్మక చిత్రం ‘గామీ’తో పాటుగా లేటెస్ట్ గా వచ్చిన యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలనే రాబట్టాయి. ఇదిలా ఉండగా.. తాజాగా చాందిని ట్విట్టర్ వేదికగా చేసిన ఓ పోస్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే?

“నేను ఇండస్ట్రీలో చూసిన దాన్ని బట్టి.. ఓ జెన్యూన్ ప్రశ్న మీ అందరిని అడుగుతున్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే ఆడవారిని మగాళ్లు ఎందుకు క్యారెక్టర్ లేని వాళ్లలా చూస్తారు? వాళ్లు మాట్లాడే ప్రతీమాట.. ఆడవాళ్లను తక్కువ చేసే విధంగానే ఉంటాయి. ఇది చాలా బాధ కలిగిస్తోంది. ఎందుకంటే? ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటివి చూసినప్పుడు మనసు విరిగిపోతుంది” అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి చాందిని పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి