iDreamPost
android-app
ios-app

మొగలి రేకులు సీరియల్‌ ఫేమ్‌ దయ మృతి.. కన్నీరు పెట్టుకున్న ఇంద్రనీల్‌ భార్య

  • Published Mar 02, 2024 | 8:14 AM Updated Updated Mar 02, 2024 | 8:14 AM

చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్‌ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దయ అలియాస్‌ పవిత్రనాథ్‌ మృతి చెందాడు. ఆ వివరాలు..

చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్‌ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దయ అలియాస్‌ పవిత్రనాథ్‌ మృతి చెందాడు. ఆ వివరాలు..

  • Published Mar 02, 2024 | 8:14 AMUpdated Mar 02, 2024 | 8:14 AM
మొగలి రేకులు సీరియల్‌ ఫేమ్‌ దయ మృతి.. కన్నీరు పెట్టుకున్న ఇంద్రనీల్‌ భార్య

మన దగ్గర సినిమా సెలబ్రిటీలకు మించి సీరియల్స్‌లో నటించే నటీనటులకు అభిమానులు ఉంటారు. సినిమా మహా అయితే మూడు గంటలు మాత్రమే ఉంటుంది. కానీ సీరియల్‌ మాత్రం ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరిస్తూ సాగుతుంది. దాంతో సీరియల్‌లో నటించే ముఖ్యమైన పాత్రదారులను ప్రేక్షకులు తమ కుటుంబ సభ్యుల మాదిరే భావిస్తారు.. ప్రేమిస్తారు. ఇక తెలుగు టెలివిజన్‌ చరిత్రలో సంచలనం సృష్టించిన సీరియల్స్‌ అంటే కచ్చితంగా గుర్తుకు వచ్చేవి చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్‌. ఈ రెండు సీరియల్స్‌ బుల్లితెరను కొన్ని ఏళ్ల పాటు ఏలాయి. ఇక సీరియల్‌లో నటించిన పాత్రధారులను ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు. స్రవంతి, ఇంద్ర, ఇక్బాల్, దయ ఇలా అన్ని పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. ఇప్పటికీ వారంతా ఓ ఫ్యామిలీలానే ఉంటారు. ఈ క్రమంలో ఓ చేదువార్త తెలిసింది. చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్‌లో ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో మెప్పించిన నటుడు మరణించాడు. ఆ వివరాలు..

చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్‌లో ఇంద్రనీల్‌ తమ్ముడి పాత్రలో నటించి.. ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించుకున్న దయ అలియాస్‌ పవిత్రనాథ్‌ మృతి చెందాడు. ఈ విషయాన్ని ఇంద్రనీల్‌ భార్య మేఘన సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది. ‘‘పవి.. ఈ బాధను మేం వర్ణించలేకపోతోన్నాం.. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి.. మేం ఈ వార్త విన్న తరువాత.. ఇది నిజం కాదని, కాకూడదని కోరుకున్నాను. ఇది అబద్ధం అయితే బాగుందని ఆశపడ్డాను. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతోన్నాం బ్రదర్. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేపోయాం.. గుడ్‌ బై కూడా చెప్పలేకపోయాం.. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. నీ ఫ్యామిలీకి ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి’’ అంటై ఇంద్రనీల్, మేఘన ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు.

ఇక మేఘన, ఇంద్రనీల్ పోస్ట్‌పై నెటిజనులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అసలేం జరిగింది.. దయ చనిపోవడం ఏంటి.. ఇదంతా ఎప్పుడు జరిగింది.. ఎందుకు ఎవరికి తెలియలేదు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఇక గతంలో పవిత్రనాథ్‌పై అతడి భార్య సంచలన ఆరోపణలు చేసింది. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని.. తన ముందే ఇంటికి వారిని తీసుకువచ్చేవాడని.. దీని గురించి ప్రశ్నిస్తే.. తనను కొట్టేవాడని ఆరోపణలు చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Meghna Raami (@raamimeghna)

marsbahis girişjojobetjojobet giriş