iDreamPost
android-app
ios-app

Chaitanya Master Mother: స్టేజ్‌పై చైతన్య మాస్టర్ తల్లి ఆవేదన! కన్నీరు పెట్టుకుంటూ ఒక్క కోరిక!

  • Published Jul 01, 2024 | 3:17 PM Updated Updated Jul 01, 2024 | 3:17 PM

Chaitanya Master Mother Emotional.. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది ఢీ. ఇప్పుడు కొత్త సీజన్ స్టార్ట్ అయ్యింది. దీనికి అందాల భామ హన్సిక జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి విదితమే. అయితే తాజా ప్రోమోలో ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది.

Chaitanya Master Mother Emotional.. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది ఢీ. ఇప్పుడు కొత్త సీజన్ స్టార్ట్ అయ్యింది. దీనికి అందాల భామ హన్సిక జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి విదితమే. అయితే తాజా ప్రోమోలో ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది.

  • Published Jul 01, 2024 | 3:17 PMUpdated Jul 01, 2024 | 3:17 PM
Chaitanya Master Mother: స్టేజ్‌పై చైతన్య మాస్టర్ తల్లి ఆవేదన! కన్నీరు పెట్టుకుంటూ ఒక్క కోరిక!

బుల్లితెరలో డ్యాన్స్ షోగా అలరిస్తోంది ఢీ. ఈ షోతో ఎంతో మంది డ్యాన్సర్లు పేరు తెచ్చుకున్నారు. అలాగే సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతి సీజన్‌ను కొత్తగా డిజైన్ చేస్తున్నారు. కొత్త కొత్త కాన్సెప్టులతో ఈ డ్యాన్స్ రియాలిటీ షో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు డీ సెలబ్రిటీ స్పెషల్ 2 స్టార్ట్ అయ్యింది. దీనికి శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్న సంగతి విదితమే. గతంలో సదా,పూర్ణ ఆకట్టుకోగా.. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ హన్సిక తన అందంతో మెస్మరైజ్ చేస్తుంది. నందు హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. శ్రీ సత్య, ఆది కూడా కంటెస్టెంట్ల తరుఫున కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా, అందులో హన్సిక ఏడ్చేసింది.

ఈ ప్రోమోలో చైతన్య మాస్టర్ తల్లిదండ్రులు రావడంతో ఒక్కసారిగా ఎమోషనల్ టచ్ వచ్చింది. చైతన్య పేరెంట్స్ వెంకట సుబ్బారావు, లక్ష్మీ రాజ్యం ఈ షోకి వచ్చారు. ఈ సందర్భంగా.. చైతన్య ఫేమస్ గెటప్ వేసుకుని తండ్రి ఎంట్రీ ఇచ్చారు. ఆయన్ను చూడగానే.. శేఖర్ మాస్టర్.. ‘చైతన్య వచ్చినట్లు ఉంది’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. చైతన్య తండ్రిని పట్టుకుని కంటెస్టెంట్స్ కంటతడి పెట్టుకున్నారు. చైతన్య గుర్తు చేసుకున్నారు.  చైతన్య మాస్టర్ తల్లి లక్ష్మీ రాజ్యం కూడా ఎంతో బాధపడ్డారు. ‘వీళ్లంతా నా కొడుకులే. రేపు నేను చనిపోతే వస్తారా..? నన్ను మోస్తారా..? మీరే నన్ను మోయాలి. మీరే తలకొరివి పెట్టాలి. ఇదే నా కోరిక.. ఎందుకంటే నాకు నా కొడుకు లేడు’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. ఇది చూసి హన్సిక కూడా కన్నీరు పెట్టుకుంది.

ఢీ షోతో పాపులర్ అయ్యాడు చైతన్య మాస్టర్. గత ఏడాది మేలో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి స్వస్థలం నెల్లూరులోని మట్టువారి పాలెం. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన చైతన్య డాన్స్ పై మక్కువతో ఇండస్ట్రీలోకి అగుడుపెట్టి.. కొరియోగ్రాఫర్‌గా ఎదిగాడు. అంతలో అతడిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. దీంతో నెల్లూరులోని క్లబ్ హోటల్‌లో సూసైడ్ చేసుకున్నాడు చైతన్య మాస్టర్. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతోనే తనువు చాలిస్తున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి మరణంతో తోటి డ్యాన్స్ మాస్టర్లని, డ్యానర్లని కలిచివేసింది. అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. తాజాగా మరోసారి అతడ్ని తలుకుంటూ.. స్పెషల్ డ్యాన్స్ ఫెర్మామెన్స్ చేయగా.. చైతన్య తల్లిదండ్రుల్ని తీసుకు రాగా, వాళ్లు ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş