iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతి.. కారణం ఏంటంటే?

  • Published Nov 11, 2023 | 11:15 AM Updated Updated Nov 11, 2023 | 11:18 AM

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల పలువురు సినీ నటులు సంతాపం తెలియజేస్తున్నారు. అసలు ఆయన మరణానికి కారణం ఏంటంటే?

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల పలువురు సినీ నటులు సంతాపం తెలియజేస్తున్నారు. అసలు ఆయన మరణానికి కారణం ఏంటంటే?

  • Published Nov 11, 2023 | 11:15 AMUpdated Nov 11, 2023 | 11:18 AM
ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతి.. కారణం ఏంటంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో రోజుకొక విషాదం చోటు చేసుకుంటుంది. శుక్రవారం ప్రముఖ నిర్మాత సాతులూరు వేణుగోపాల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషాద ఘటన మరువకముందే శనివారం ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇదే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలియజేశారు. ఈ వార్త తెలియడంతో సినీ లోకం అంతా శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఆయన అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ క్రమంలోనే అసలు చంద్రమోహన్ ఎలా చనిపోయారని అందరూ చర్చించుకుంటున్నారు.

చంద్రమోహన్ మృతికి కారణం:

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తొంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు విషమించింది. ఇక ఈ క్రమంలోనే చంద్రమోహన్ శనివారం ఉదయం చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే కన్నుమూశారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇదే విషయాన్ని మీడియాకు తెలియజేశారు. చంద్రమోహన్ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నట్లు కూడా తెలిపారు. ఆయన మృతితో సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss