iDreamPost
android-app
ios-app

Jani Master: బ్రేకింగ్: జానీ మాస్టర్ పై కేసు నమోదు! డ్యాన్సర్ ను రే* ప్ చేశాడంటూ!

  • Published Sep 16, 2024 | 9:18 AM Updated Updated Sep 16, 2024 | 12:52 PM

Case File On Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. ఆయనపై పోలీసులు కేసు నమోదైంది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

Case File On Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. ఆయనపై పోలీసులు కేసు నమోదైంది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

  • Published Sep 16, 2024 | 9:18 AMUpdated Sep 16, 2024 | 12:52 PM
Jani Master: బ్రేకింగ్: జానీ మాస్టర్ పై కేసు నమోదు! డ్యాన్సర్ ను రే* ప్ చేశాడంటూ!

ప్రముఖ టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ జానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక మంది స్టార్ హీరోలకు డ్యాన్స  కొరియో గ్రఫీ  చేసి..మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది ఇలా ఉంటే..తాజాగా జానీ మాస్టర్  వివాదంలో చిక్కుకున్నాడు. తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని జానీ దగ్గర పని చేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసును నార్సింగ్ పీఎస్ కి బదిలీ చేశారు.

ఢీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ లో అడుగుపెట్టిన జానీ మాస్టర్ అనంతికాలంలోనే స్టార్ హీరోలకు డాన్స్ కొరియోగ్రఫీ చేసే రేంజ్ జానీ మాస్టర్ ఎదిగాడు. ఇటీవల కేంద ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. కెరీర్ ఇలా పీక్ స్టేజ్ లో సాగుతూ ఉండగా జానీ మాస్టర్ ఈ వివాదంలో చిక్కుకున్నాడు. తనపై అత్యాచారం చేసాడని ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని జానీ దగ్గర పని చేసే ఓ  మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అవుట్‌ డోర్ షూటింగ్ కోసం చెన్నై, ముంబై, హైదరాబాద్‌ తో సహా  పలు ప్రాంతాలకు వెళ్లినప్పుడు తనపై అత్యాచారం చేసాడని ఫిర్యాదులో పేర్కొంది.

అలాగే హైదరాబాద్ లోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై  పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. అనంతరం తదుపరి విచారణ కోసం  నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు. ఇక్కడ జానీ మాస్టర్ పై ఐపిసి సెక్షన్ 376, సెక్షన్ 506, సెక్షన్ 323 లోన క్లాజ్ 2, N కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే జానిపై   గతంలో  కూడా పలు కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఏ క్షణమైనా అతనిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మరి తనపై నమోదైన ఫిర్యాదుపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరో వైపు జానీ మాస్టర్ సినిమాల విషయానికి వస్తే..  ప్రస్తుతం హీరోగా రన్నర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet