iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: టాలీవుడ్ నటుడిపై కేసు నమోదు! ప్రేమ పేరుతో మోసం!

  • Published Jul 27, 2024 | 4:34 PM Updated Updated Jul 27, 2024 | 4:34 PM

Aman Singh.. టాలీవుడ్ ఇండస్ట్రీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. మొన్న హేమ, ఇటీవల రాజ్ తరుణ్, అలాగే ప్రముఖ నటుడి సోదరుడిపై పోలీసు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మరో నటుడిపై ఫిర్యాదు అందింది.

Aman Singh.. టాలీవుడ్ ఇండస్ట్రీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. మొన్న హేమ, ఇటీవల రాజ్ తరుణ్, అలాగే ప్రముఖ నటుడి సోదరుడిపై పోలీసు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మరో నటుడిపై ఫిర్యాదు అందింది.

  • Published Jul 27, 2024 | 4:34 PMUpdated Jul 27, 2024 | 4:34 PM
బ్రేకింగ్: టాలీవుడ్ నటుడిపై కేసు నమోదు! ప్రేమ పేరుతో మోసం!

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత మంది యాక్టర్స్ వార్తల్లో నిలుస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ అరెస్టైన సంగతి విదితమే. ప్రముఖ నటుడు రాజ్ తరుణ్ తనను చీటింగ్ చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీస్ మెట్లెక్కింది. ఇంకా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అలాగే డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో నటుడిపై కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ నగరానికి చెందిన వర్దమాన నటుడు అమన్ సింగ్‌పై అత్యాచార కేసుతో పాటు చీటింగ్ కేసు నమోదైంది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేస్ ఫైల్ చేశారు పోలీసులు.

తనను ప్రేమ పేరుతో నమ్మించి.. తనను శారీరకంగా వినియోగించుకున్నాడని, పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత యువతి. అలాగే తామిద్దరం క్లోజ్‌గా ఉన్న ఫోటోలతో బెదిరిస్తున్నాడని పేర్కొంది. బేగంపేట ప్రాంతానికి చెందిన ఓ యువతి.. అమన్ సింగ్ అనే నటుడు తనను మోసం చేశాడని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. జిమ్‌లో తామిద్దరికి పరిచయం అయ్యిందని, తనను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుసార్లు లొంగదీసుకున్నట్లు చెబుతుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు మొహం చాటేస్తున్నాడని పేర్కొంది.

అంతేకాకుండా తామిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు దిగిన ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కంప్లయింట్‌లో పేర్కొంది. దీంతో ఫిర్యాదుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు తెలుగు నటుడు అమన్ సింగ్ మీద రేప్ కేస్‌తో పాటు చీటింగ్ కేసు నమోదు చేశారు.   అమన్ సింగ్ ప్రస్తుతానికి ఏ సినిమాలు చేస్తున్నాడో తెలియాల్సి ఉంది. రెండు మూడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినట్లు తెలుస్తోంది.  నటుడిపై కేసు నమోదైందన్న వార్తలతో  ఎవరీ అమన్ సింగ్ అనే చర్చ జరుగుతోంది.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet