iDreamPost
android-app
ios-app

కల్కి సీక్వెల్ కు కొత్త టైటిల్… ఇదే ఫైనల్ చేస్తారా !

  • Published Sep 23, 2024 | 4:54 PM Updated Updated Sep 24, 2024 | 11:03 AM

Kalki Movie Sequel Update: ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తానూ పరుగులు పెట్టడమే కాకుండా దర్శకులను కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేసిన కల్కి మూవీ సిక్వెల్ పై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

Kalki Movie Sequel Update: ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తానూ పరుగులు పెట్టడమే కాకుండా దర్శకులను కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేసిన కల్కి మూవీ సిక్వెల్ పై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

  • Published Sep 23, 2024 | 4:54 PMUpdated Sep 24, 2024 | 11:03 AM
కల్కి సీక్వెల్ కు కొత్త టైటిల్… ఇదే ఫైనల్ చేస్తారా !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి. ఈ ఏడాది ఇప్పటివరకు రిలీజ్ అయినా సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ ఇది. ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమాతో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మహాభారతం గురించి చర్చించుకునేలా చేశాయి. ఇలాంటి ఒక మూవీ తీయడం కేవలం నాగ్ అశ్విన్ కు మాత్రమే సాధ్యం అని నిరూపించుకున్నారు. ఇక ఈ సినిమాకు పార్ట్ 2 ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఈ పార్ట్ 2 అయితే ఇప్పటిలో రాదనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఈ మూవీ టైటిల్ విషయంలో మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ స్పీడ్ చూసి నోటి మీద వేలు వేసుకుంటున్నారు. ఆ రేంజ్ లో వరుసగా ప్రాజెక్ట్స్ కు ఓకే చెప్పి.. అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు. తానూ పరుగులు పెట్టడమే కాకుండా దర్శకులను కూడా పరుగులు పెట్టిస్తున్నారు ఈ హీరో. ఇక ఈ ఏడాది ఆల్రెడీ కల్కి మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసాడు డార్లింగ్. ఆల్రెడీ ఈ సినిమాకు సిక్వెల్ ను కూడా అనౌన్స్ చేసేసారు. మొదటి పార్ట్ చూసిన ప్రేక్షకులంతా సిక్వెల్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ సిక్వెల్ కు సంబంధించిన అప్డేట్స్ గురించి మాత్రం ఏమి ఆశించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ ఉన్న బిజీకి ఇప్పట్లో ఈ సినిమా రావడం కష్టం. అయితే పార్ట్-2 కి సంబంధించి వినిపిస్తున్న బజ్ ఏంటంటే.. ఈ మూవీ సిక్వెల్ కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్ ను పెట్టనున్నట్లు సమాచారం. అంతే కాకుండా సిక్వెల్ లో పురాణాల గురించి కూడా ఎక్కువగా ప్రస్తావించే అవకాశం ఉందట.

అయితే కల్కి మొదటి పార్ట్ ను కర్ణుడి క్యారక్టర్ తోనే ముగించారు. కాబట్టి సిక్వెల్ మొత్తం కూడా దాదాపు ఈ పాత్ర చుట్టూనే తిరిగే అవకాశం లేకపోలేదు. అందుకోసమే.. సిక్వెల్ లో కర్ణ 3102 బీసీ అనే టైటిల్ ను పెట్టినట్లు సమాచారం. కర్ణుడికి , అశ్వద్ధామ కు మధ్య చాలానే సన్నివేశాలు కూడా ఉండనున్నాయని సమాచారం. మొదటి పార్ట్ చూసిన తర్వాత ప్రేక్షకులంతా మహాభారతం గురించి చర్చించుకున్నారు. ఇక ఇప్పుడు వినిపిస్తున్న బజ్ ప్రకారం.. రెండో పార్ట్ చూడాలంటే మాత్రం మహాభారతం చూసి వెళ్ళాలేమో అనిపిస్తుంది. ఏమౌతుందో చూడాలి. అలాగే ఇప్పుడు వినిపిస్తున్న సిక్వెల్ టైటిల్ లో కూడా ఎంత వరకు నిజం ఉందొ తెలియదు. దీనిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio