iDreamPost
android-app
ios-app

Ram Charan: ఉపాసనకు కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్! బర్త్ డే రోజు రివీల్..

ఉపాసన బర్త్ డే రోజున ఆమెకు ఓ కొత్త పేరు పెట్టాడు రామ్ చరణ్. ఆ పేరుతోనే విష్ చేశాడు. మరి ఇంతకీ తన భార్యకు చరణ్ పెట్టిన కొత్త పేరు ఏంటంటే?

ఉపాసన బర్త్ డే రోజున ఆమెకు ఓ కొత్త పేరు పెట్టాడు రామ్ చరణ్. ఆ పేరుతోనే విష్ చేశాడు. మరి ఇంతకీ తన భార్యకు చరణ్ పెట్టిన కొత్త పేరు ఏంటంటే?

Ram Charan: ఉపాసనకు కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్! బర్త్ డే రోజు రివీల్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చరణ్ సినిమాలతో బిజీగా ఉంటే.. ఇక ఉపాసన బిజినెస్ ఉమెన్ గా దూసుకెళ్తున్న విషయం తెలియనిది కాదు. తాజాగా జూలై 20న ఉపాసన తన పుట్టినరోజును గ్రాండ్ గా ఇంట్లోనే జరుపుకొంది. ఇక ఉపాసన బర్త్ డే రోజున ఆమెకు ఓ కొత్త పేరు పెట్టాడు రామ్ చరణ్. ఆ పేరుతోనే విష్ చేశాడు. మరి ఇంతకీ తన భార్యకు చరణ్ పెట్టిన కొత్త పేరు ఏంటంటే?

రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాజాగా తన బర్త్ డేను ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్ గా జరుపుకొంది. ఈ సందర్బంగా సినీ ప్రముఖులతో పాటుగా అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఉపాసన పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఆమెకు ఓ కొత్త పేరును పెట్టాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే కారా మమ్మీ’ అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు. ఇక ఈ కామెంట్ కు ఉపాసన రిప్లై ఇస్తూ..”థ్యాంక్యూ మిస్టర్ సీ.. నీ సెల్ఫీ స్కిల్స్ సూపర్’ పొగిడింది. కాగా.. ఉపాసన గతేడాది క్లింకారకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

ఇక రామ్ చరణ్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం స్టార్  డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్నాడు. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. డిసెంబర్ లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు  డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. పల్లెటూరు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి