iDreamPost
android-app
ios-app

అల్లు అర్జున్ స్నేహం అలా ఉంటుంది! బన్నీ వాసు ఎమోషనల్ కామెంట్స్!

  • Published Aug 14, 2024 | 10:23 AM Updated Updated Aug 14, 2024 | 10:23 AM

Bunny vasu: నిర్మాత బన్నీ వాసు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఉన్న స్నేహ బంధం గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. తను ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం బన్నీనే అని వెల్లడించారు.

Bunny vasu: నిర్మాత బన్నీ వాసు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఉన్న స్నేహ బంధం గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. తను ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం బన్నీనే అని వెల్లడించారు.

అల్లు అర్జున్ స్నేహం అలా ఉంటుంది! బన్నీ వాసు ఎమోషనల్ కామెంట్స్!

పుష్ప ది రైజ్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన హై వోల్టేజ్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. పుష్ప మూవీలో చేసిన నటనకు అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వరించింది. ఇక ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్ తో బాక్సాఫీస్ షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. బన్నీ ఫ్రెండ్ షిప్ కు ఎంతో వాల్యూ ఇస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్నేహితులకు అండగా నిలుస్తారు. అల్లు అర్జున్ ఫ్రెండ్ షిప్ పై ప్రొడ్యూసర్ బన్నీ వాసు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బన్నీ స్నేహం అలా ఉంటుందంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.

బన్నీ వాసు.. 100% లవ్, పిల్లా నువ్వు లేని జీవితం, భలే భలే మగాడివోయ్, చావు కబురు చల్లగా సినిమాలను నిర్మించారు. కాగా ఐకాన్ స్టార్ తో తనకున్న ఫ్రెండ్ ఫిప్ ను గుర్తు చేసుకున్నారు బన్నీ వాసు. అల్లు అర్జున్ కు స్నేహమంటే ప్రాణమని.. అవసరం ఉందంటే చాలు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాడని తెలిపారు. తను ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం బన్నీనే అని వెల్లడించారు. ఈ క్రమంలో తనకు అల్లు అర్జున్‌కు మధ్య విభేదాలున్నాయంటూ వస్తోన్న వార్తలను బన్నీ వాసు ఖండించారు. అల్లు అర్జున్ కు తనకు మధ్య ఉన్న స్నేహబంధాన్ని గురించి నిర్మాత బన్నీ వాసు తెలిపారు.

bunny vasu emotional comments about allu arjun

బన్నీ వాసు మాట్లాడుతూ.. నాకు కష్టం వచ్చిందంటే అండగా నిలిచేందుకు ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ మందుంటారు. వాళ్లలో ఒకరు మా అమ్మ అయితే.. రెండో వ్యక్తి నా ఫ్రెండ్ అల్లు అర్జున్‌ అని చెప్పారు. నాకు అవసరం ఉన్న ప్రతిసారి ఆయన ముందుండి నడిపిస్తారు. స్నేహితుడికి కష్టం వస్తే తనకు ఎలా సపోర్ట్‌ చేయాలని తెలిసిన ఏకైక వ్యక్తి నా దృష్టిలో అల్లు అర్జునే అని అన్నారు. 20 ఏళ్ల క్రితం నేను గీతా ఆర్ట్స్‌ నుంచి వెళ్లిపోవాల్సిన సంఘటన ఎదురైంది. ఆరోజు బన్నీ నాకు సపోర్ట్‌ చేయడం కోసం వాళ్ల నాన్నను కూడా ఎదిరించారు. అప్పుడు ఆయన సపోర్ట్‌ చేయకపోతే ఈరోజు నేను ఈ స్థానంలో ఉండేవాడిని కాదంటూ బన్నీ వాసు తమ స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు.