iDreamPost
android-app
ios-app

పుష్ప 2.. బన్నీ, సుకుమార్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ఫుల్ క్లారిటీ ఇచ్చిన బన్నీవాసు!

  • Published Aug 05, 2024 | 11:23 AM Updated Updated Aug 05, 2024 | 11:51 AM

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అనే విషయంతో పాటుగా పుష్ప 2 వాయిదా వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు ప్రొడ్యూసర్ బన్నీ వాసు. ఆ వివరాల్లోకి వెళితే..

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అనే విషయంతో పాటుగా పుష్ప 2 వాయిదా వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు ప్రొడ్యూసర్ బన్నీ వాసు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 05, 2024 | 11:23 AMUpdated Aug 05, 2024 | 11:51 AM
పుష్ప 2.. బన్నీ, సుకుమార్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ఫుల్ క్లారిటీ ఇచ్చిన బన్నీవాసు!

పుష్ప 2.. గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. దానికి కారణాలు లేకపోలేదు. ఆగస్ట్ 15కి రావాల్సిన మూవీ డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ కావడంతో.. ఇటు బన్నీ ఫ్యాన్స్, అటు సుకుమార్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. దీనికితోడు లేటెస్ట్ గా ఈ మూవీ డిసెంబర్ 6కి రావడం లేదంటూ.. 2025 ఏప్రిల్ కు వెళ్లిందన్న న్యూస్ వైరల్ గా మారింది. దాంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే వాయిదా వార్తలపై పూర్తి క్లారిటీ ఇవ్వడంతో పాటుగా ఫ్యాన్స్ కు పండగలాంటి న్యూస్ చెప్పాడు నిర్మాత బన్నీవాసు. దాంతో పాటుగా ప్రజెంట్ అల్లు అర్జున్, సుకుమార్ లు ఏం చేస్తున్నారో కూడా చెప్పాడు.

పుష్ప 2 డిసెంబర్ 6కు కూడా రావడం కష్టమే అని, వచ్చే ఏడాది ఏప్రిల్ లోకి పోస్ట్ పోన్ అయ్యిందని చాలా వార్తలు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. దాంతో అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక ఈ వాయిదా వార్తలపై పూర్తి క్లారిటీ ఇవ్వడంతో పాటుగా ప్రస్తుతం బన్నీ, సుకుమార్ ఏం చేస్తున్నారో కూడా వెల్లడించాడు యంగ్ ప్రొడ్యూసర్ బన్నీవాసు. లేటెస్ట్ గా బన్నీవాసు నిర్మించిన ‘ఆయ్’ మూవీ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పుష్ప 2 వాయిదా వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

బన్నీవాసు మాట్లాడుతూ..”ప్రకృతి విపత్తులు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుంటే.. అనుకున్న ప్రకారం డిసెంబర్ 6కు కచ్చితంగా పుష్ప 2 థియేటర్లలోకి వస్తుంది. ఈ తేదీని దృష్టిలో పెట్టుకునే సుకుమార్ కానీ, టీమ్ గానీ మెుత్తం ప్లానింగ్స్ చేసుకున్నారు. ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతోంది. దాంతో పాటుగా బన్నీ, సుకుమార్ కూడా మైత్రీ ఆఫీస్ లో మీటింగ్ జరిగింది. వాయిదా వార్తలను నమ్మాల్సిన అవసరం లేదు. వాటిని చూసు నవ్వుకోవాలి అంతే. హీరో గడ్డం గీసుకోకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? దాన్ని పెద్ద ఇష్యూ చేసి, బన్నీకి, సుకుమార్ కు గొడవలు జరిగాయని న్యూస్ స్ప్రెడ్ చేశారు. పుష్ప 2 షూటింగ్ జరుతోంది. బన్నీకూడా షూట్ లో పాల్గొనబోతున్నాడు” అంటూ వాయిదా వార్తలపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు. ఈ న్యూస్ తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgar girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom