iDreamPost
android-app
ios-app

VD 12.. గూస్ బంప్స్ ఎక్కించే అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్! ఫ్యాన్స్ కు పండగే..

  • Published Aug 05, 2024 | 10:26 AM Updated Updated Aug 05, 2024 | 11:24 AM

VD12 Latest Update: విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ VD12 కు సంబంధించి ఓ గూస్ బంప్స్ ఎక్కించే అప్డేట్ ఇచ్చాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. లేటెస్ట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు తోడు.. ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

VD12 Latest Update: విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ VD12 కు సంబంధించి ఓ గూస్ బంప్స్ ఎక్కించే అప్డేట్ ఇచ్చాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. లేటెస్ట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు తోడు.. ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 05, 2024 | 10:26 AMUpdated Aug 05, 2024 | 11:24 AM
VD 12.. గూస్ బంప్స్ ఎక్కించే అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్! ఫ్యాన్స్ కు పండగే..

మూవీ మేకర్స్ తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటేనే ఫ్యాన్స్ కు సంతోషం. ఇలా అప్డేట్స్ ఇవ్వడంతో.. సదరు మూవీపై భారీ హైప్ కూడా క్రియేట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కొన్ని కొన్ని సార్లు ఫ్యాన్స్ ఊహించని వివరాలు వెల్లడిస్తూ.. వారికే షాకిస్తుంటారు మూవీ మేకర్స్. తాజాగా అలాంటి ఓ గూస్ బంప్స్ ఎక్కించే అప్డేట్ ఇచ్చాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ VD12 కు సంబంధించి క్రేజీ లీక్ ఇచ్చాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్.

విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత నాగవంశీ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సూపర్ కాప్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. రఫ్ అండ్ రియలిస్టిక్ లుక్ లో విజయ్ మెస్మరైజ్ చేశాడు.

ఇదిలా ఉండగా.. వీడీ 12 గురించి ఓ క్రేజీ అప్డేట్ ను నిర్మాత నాగవంశీ వదిలారు. “విజయ్ దేవరకొండ సినిమాతో నేను ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదు. పైగా ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాం. ఇందుకు సంబంధించి స్టోరీ సిద్ధంగా ఉంది.  డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తాడన్న నమ్మకం మాకుంది. తొలి పార్ట్ ఫలితం ఆధారంగా సీక్వెల్ ను తెరకెక్కిస్తాం” అంటూ చెప్పుకొచ్చాడు. తమ అభిమాన హీరో సినిమా రెండు భాగాలుగా రానుండటంతో.. ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ప్రొడ్యూసర్ ఊహించని విధంగా గూస్ బంప్స్ ఎక్కించే అప్డేట్ ఇవ్వడంతో.. సినిమాపై అంచనాలు కూడా  పెరిగిపోయాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Naga Vamsi Suryadevara (@nagavamsi19)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss