iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. రామ్ చరణ్ మూవీలో నటించే అవకాశం

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ 15వ చిత్రంగా తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ ఎప్పుడు విడుదలౌతుందో తెలియదు. ప్రస్తుతం మైసూరులో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే చరణ్ తన 16వ చిత్రాన్ని షురూ చేసిన సంగతి విదితమే. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఆ చిత్ర యూనిట్.

రామ్ చరణ్, శంకర్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు. అయితే తన 16వ చిత్రాన్ని షురూ చేశాడు మన మెగా తనయుడు చరణ్. ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు లెక్కల మాస్టారు, పుష్ప దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా. ఉప్పెన సినిమాతో అతడేంటో నిరూపించుకున్నాడు. రెండవ సినిమానే పాన్ ఇండియన్ స్టార్ రామ్ చరణ్‌ను డైరెక్ట్ చేయబోయే అవకాశం వచ్చింది. దీన్ని భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్ తీయబోతున్నారని వినికిడి. అయితే ఈ పిక్చర్ కోస్తా బ్యాక్ డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి ఏఆర్ రెహమన్ మ్యూజిక్ అందిస్తున్నట్లు డైరెక్టర్ బుచ్చిబాబు ఓ షోలో వెల్లడించాడు.

ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ ఓ భారీ ఆఫర్ తో ముందుకు వచ్చింది. ఆడిషన్స్ నిర్వహిస్తోంది. అన్ని వయస్సుల వారిని ఆడిషన్‌కు ఆహ్వానిస్తోంది. అయితే ఉత్తరాంధ్ర గ్రామీణ భాష బాగా తెలిసిన వారికి ప్రాధాన్యత ఉండబోతుంది.  ఒక నిమిషం వీడియోతో పాటు.. మూడు ఫోటోలు మెయిల్ కానీ, వాట్సప్ నంబర్ కు కానీ పంపాలంటూ పేర్కొంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ విడుదల చేశారు. రామ్ చరణ్ సినిమాలో కనిపించాలనుకుంటే.. ఉత్తరాంధ్ర భాష బాగా తెలిసి ఉంటే.. ఇక ఎందుకు ఆలస్యం పోస్టర్‌లో పేర్కొన్న వాట్సప్, ఈమెయిల్స్‌కు వీడియో, ఫోటోలను పంపించేయండి. ఇక ఆడిషన్స్ అయిపోయాక ఈ మూవీ తర్వలో సెట్స్ కు వెళ్లే అవకాశాలున్నాయి.  2024 మార్చిలో షూటింగ్ మొదలు పెట్టి.. 2025 సమ్మర్ లో మూవీ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు.