iDreamPost
android-app
ios-app

ధన్‌రాజ్‌ నటించిన ఆ హిట్టు సినిమాకు సీక్వెల్‌..

  • Published Oct 28, 2023 | 2:10 PM Updated Updated Oct 28, 2023 | 2:10 PM

దాదాపు సంవత్సరం తర్వాత ఈ సినిమా ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌ అందింది. ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ కూడా తాజాగా ప్రారంభం అయింది.

దాదాపు సంవత్సరం తర్వాత ఈ సినిమా ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌ అందింది. ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ కూడా తాజాగా ప్రారంభం అయింది.

  • Published Oct 28, 2023 | 2:10 PMUpdated Oct 28, 2023 | 2:10 PM
ధన్‌రాజ్‌ నటించిన ఆ హిట్టు సినిమాకు సీక్వెల్‌..

ధన్‌రాజ్‌, సునీల్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ బుజ్జి ఇలా రా’. 2022 సెప్టెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. మౌత్‌ టాక్‌ ద్వారా ప్రజల్లోకి దూసుకుపోయింది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అంతేకాదు! రివ్యూల విషయంలోనూ ‘బుజ్జి ఇలా రా’ సత్తా చాటింది. జాతీయ మీడియాలు సైతం సినిమాకు మంచి రివ్యూలు ఇచ్చాయి.

దాదాపు సంవత్సరం తర్వాత ఈ సినిమా ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌ అందింది. ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ కూడా తాజాగా ప్రారంభం అయింది. తాజాగా, ఈ సినిమా లోగో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఓంకార్‌, కెమెరామ్యాన్‌ సెంథిల్‌ కుమార్‌ ఇతర సినిమా టీం పాల్గొన్నారు. ఓంకార్‌, సెంథిల్‌ కుమార్‌ టైటిల్‌ లోగోను ఆవిష్కరించారు. మొదటి భాగంలాగానే రెండో భాగం కూడా మంచి విజయాన్ని నమోదు చేయాలని కోరుకున్నారు.

ఇక, ఈ సినిమాకు ప్రముఖ కెమెరామ్యాన్‌ అంజి దర్శకత్వం వహించనున్నారు. చరణ్‌ అర్జున్‌ సంగీతం అందించనున్నారు. సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫీ వహిస్తున్నారు. చోటా. కె.ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతల్ని చేపట్టనున్నారు. సెకండ్‌ పార్టులోనూ ధనరాజ్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. మై సినిమా టాకీస్ బ్యానర్ చిత్ర నిర్మాణ బాధ్యతల్ని చేపడుతోంది. మరి, హిట్టు సినిమా బుజ్జి ఇలా రాకు సీక్వెల్‌ రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişkingroyalgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom