బోయపాటి రిపీట్ సెంటిమెంట్.. స్కందకి హెల్ప్ అవుతుందా?

  • Author ajaykrishna Updated - 01:12 PM, Wed - 27 September 23
  • Author ajaykrishna Updated - 01:12 PM, Wed - 27 September 23
బోయపాటి రిపీట్ సెంటిమెంట్.. స్కందకి హెల్ప్ అవుతుందా?

సినిమా రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా అందరి దృష్టి ముందుగా సాంగ్స్ వైపు.. ఆ తర్వాత ట్రైలర్ పై పడుతుంది. ఎందుకంటే.. అవి ఎంత ఆకట్టుకుంటే సినిమాకు అంత బజ్ క్రియేట్ అవుతుంది. అలాగే మంచి హైప్ తో కలెక్షన్స్ కూడా అదిరిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా రిలీజ్ డే సినిమా కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే.. కలెక్షన్స్ ని ఏది ఆపలేదు. కానీ.. కొన్ని సినిమాలకు సంబంధించి డైరెక్టర్స్ ని బట్టి అంచనాలు సెట్ అవుతుంటాయి. అలా మాస్ డైరెక్టర్ బోయపాటిది ఓ స్టైల్. బోయపాటి సినిమా అంటే.. పక్కాగా మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు యాక్షన్ బ్లాక్స్ కూడా అదిరిపోతాయి.

ఇవన్నీ ఫ్యాన్స్ కి కావాల్సిన అంశాలే. కాకపోతే బోయపాటి సినిమా అనగానే.. అక్కడ హీరో బాలయ్య అయితే ఏ ఒక్కరూ సినిమా ఎలా ఉండబోతుంది? ట్రైలర్ ఎలా ఉంది? అనేది చూడరు. కానీ.. బోయపాటి బాలయ్య కాకుండా వేరే ఏ హీరోలతో సినిమాలు చేసినా.. ఖచ్చితంగా ప్రతీ పాయింట్ పై దృష్టి పెడుతుంటారు. అలా ఇప్పుడు రామ్ పోతినేనితో బోయపాటి తెరకెక్కించిన ‘స్కంద’పై ఫోకస్ పెట్టేశారు. తమన్ అందించిన సాంగ్స్ పర్వాలేదు అనిపిస్తున్నా.. స్కంద ఫస్ట్ ట్రైలర్ ఫ్యాన్స్ ని కాస్త నిరాశకు గురి చేసిందని చెప్పాలి. ఎందుకంటే.. హీరో మారినా కంటెంట్ మారలేదు అనే ఫీలింగ్ కలిగించారు.

కట్ చేస్తే.. సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూశాక స్కంద పై అంచనాలు పెట్టుకోవచ్చు అని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే.. ట్రైలర్ కట్ లోనే ఎంత డిఫరెన్స్ క్రియేట్ అయ్యిందో చూడవచ్చు. అయితే.. స్కంద సెకండ్ ట్రైలర్ బాగుంది. యాక్షన్, ఫైట్స్.. రామ్ డైలాగ్స్.. శ్రీలీల గ్లామర్ అన్ని బాగున్నాయి. కానీ.. బోయపాటి తన మార్క్ దేవుడి సెంటిమెంట్ మాత్రం స్కందలో కూడా వదలలేదు. అఖండలో మాదిరే.. అంతెందుకు తన అన్ని సినిమాలలో మాదిరి చట్టం, ధర్మం, దైవం.. ఈ మూడు సెంటిమెంట్స్ కామన్ గా రిపీట్ చేశాడని టాక్ నడుస్తుంది. మరి అఖండలో బాలయ్య అఘోరా కాబట్టి.. అలాంటి డైలాగ్స్ వర్కౌట్ అయ్యాయి. మరి రామ్ సినిమాలో కూడా అంటే.. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మరి బోయపాటి మాస్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments