iDreamPost
android-app
ios-app

ఆ డైరెక్టర్ పై ప్రేమను ఒలకబోసిన మిల్కీ బ్యూటీ తమన్నా!

  • Published Jul 22, 2023 | 8:35 PM Updated Updated Jul 22, 2023 | 8:35 PM
  • Published Jul 22, 2023 | 8:35 PMUpdated Jul 22, 2023 | 8:35 PM
ఆ డైరెక్టర్ పై ప్రేమను ఒలకబోసిన మిల్కీ బ్యూటీ తమన్నా!

తమన్నా.. తన అందం, అభినయంతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. చెక్కు చెదరని అందంతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. ఇకపోతే ఈ అందాల సుందరి వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ తెగ బిజీగా మారిపోయింది. ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ వరకు ఎక్కడ ఆఫర్ వస్తే అక్కడ వాలిపోతుంది. అయితే ప్రస్తుతం తమన్నా.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి “భోళా శంకర్” సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి తాజాగా మిల్కీ బ్యూటీ అనే పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ కు ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ వేడుకలో హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ.. ” నేను ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో అందరూ నన్ను మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటే నా కలర్ గురించి మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. కానీ, నాపై ప్రేమను ఇలా చూపిస్తున్నారు తర్వాత తెలుసుకున్నాను. ఇప్పుడు అదే పేరుతో పాట రావడం, చిరంజీవి సార్ తో కలిసి డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది.

మేము షూటింగ్ లో ఉన్నప్పుడు చిరంజీవి గారు నన్ను థమన్ అని పిలిచేవారు. ఆయన అలా పిలవడంతో థమన్ నా పక్కనే ఉన్నారనే ఫీలింగ్ కలిగేది. నువ్వు నాలో సగం అయిపోయావు థమన్. అంతే కాదు.. థమన్ నాకు మధ్య ప్రత్యేకమైన బాండింగ్ ఉంది అంటూ తమన్నా తెలిపింది. అయితే ఉన్నట్టుండి తమన్నా థమన్ గురించి ఇలా మాట్లాడడంతో అందరూ షాకవుతున్నారు. ఇన్నాళ్లకి ఆ సంగీత దర్శకుడిపై ఉన్న ప్రేమను ఈ రోజు చెప్పుకొచ్చావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: యాంకర్ రష్మీని అవమానించిన కమెడియన్.. రాత్రికి రమ్మంటూ ఘోరంగా..!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişartemisbet girişgrandpashabet