iDreamPost
android-app
ios-app

సీఎం కేసీఆర్ ను సతీసమేతంగా కలుసుకున్న బ్రహ్మానందం

  • Published Jul 29, 2023 | 8:41 PM Updated Updated Jul 29, 2023 | 8:41 PM
  • Published Jul 29, 2023 | 8:41 PMUpdated Jul 29, 2023 | 8:41 PM
సీఎం కేసీఆర్ ను సతీసమేతంగా కలుసుకున్న బ్రహ్మానందం

గత నాలుగు దశాబ్దాలుగా చిత్ర సీమను ఏలుతున్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పిన తక్కువే. తన నటనా కౌశల్యంతో ఎందరి నుంచో ప్రశంసలు అందుకుని ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇక ఇప్పటికీ కూడా ఆయన సినిమాల్లో నటిస్తూ తన మార్క్ ను చూపిస్తున్నారు. తాజాగా విడుదలైన బ్రో చిత్రంలోనూ బ్రహ్మానందం నటించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును తాజాగా బ్రహ్మానందం హైదరాబాద్ లో కలుసుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును హాస్య బ్రహ్మ బ్రహ్మానందం శనివారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సతీసమేతంగా కలుసుకున్నారు. బ్రహ్మానందం దంపతులకు, వారి పెద్ద కుమారుడికి సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. అసలు విషయం ఏంటంటే? బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్ వివాహం త్వరలో హైదరాబాద్ లో జరగనుంది. ఈ మేరకు బ్రహ్మానందం వివాహ ఆహ్వాన పత్రికను సీఎం దంపతులకు అందజేసి రావాలని పిలిచారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం తనే స్వయంగా డ్రాయింగ్ వేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్ర పటాన్ని సీఎంకు అందించారు. ఆ తర్వాత అందరూ కొద్దిసేపు కూర్చుని మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇది కూడా చదవండి: పొలిటికల్ ఎంట్రీపై ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎక్కడైనా గెలుస్తానంటూ..!

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet