iDreamPost
android-app
ios-app

క్రిస్మస్ బిగ్గెస్ట్ వార్ తప్పదు.. షాకిస్తున్న క్రిటిక్ ట్వీట్!

  • Author ajaykrishna Updated - 01:01 PM, Sat - 14 October 23
  • Author ajaykrishna Updated - 01:01 PM, Sat - 14 October 23
క్రిస్మస్ బిగ్గెస్ట్ వార్ తప్పదు.. షాకిస్తున్న క్రిటిక్ ట్వీట్!

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద క్రిస్మస్ కి బిగ్గెస్ట్ వార్ జరగబోతుంది. పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ఇద్దరు స్టార్స్.. ఒకేరోజు తలపడనున్నారు. వారే డార్లింగ్ ప్రభాస్, కింగ్ షారుఖ్ ఖాన్. ప్రభాస్ నటించిన సలార్ మూవీ.. షారుఖ్ నటించిన డుంకి మూవీ ఒకేసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. దీంతో ఇరు హీరోల ఫ్యాన్స్ లో ఎక్సయిట్ మెంట్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. ప్రభాస్ తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీపై అంచనాలు తీవ్రంగా ఉన్నాయి. కేజీఎఫ్, కాంతార సినిమాలు నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు సలార్ ని నిర్మించారు. కాగా.. సినిమా ఆల్రెడీ ఓసారి వాయిదా పడి.. డిసెంబర్ 22న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది.

అప్పటికే ఆ డేట్ ని లాక్ చేసి పెట్టుకుంది షారుఖ్ ఖాన్ డుంకి మూవీ. లెజెండరీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని రూపొందిస్తున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. కాగా.. ఈ సినిమాని కూడా క్రిస్మస్ కి తీసుకొచ్చే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. అయితే.. కొద్దిరోజులుగా డుంకి మూవీ రిలీజ్ వాయిదా పడనుందని.. ఆ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్ లో ఉందని.. సో సినిమా ఈ ఏడాది ఎండింగ్ లో రాకపోవచ్చు అని టాక్ నడిచింది. కట్ చేస్తే.. ఇప్పటిదాకా సినిమా నుండి ఎలాంటి టీజర్ కూడా రాకపోవడంతో షారుఖ్ ఫ్యాన్స్ కూడా సగం సగం నమ్మకంతో నిరాశకు గురయ్యారు.

కట్ చేస్తే.. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ డుంకి రిలీజ్ పై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టేసాడు. “డుంకి రిలీజ్ లో ఎలాంటి వాయిదా లేదు. డిసెంబర్ 22నే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. డుంకి గురించి వస్తున్న వార్తలను నమ్మకండి. షారుఖ్ నటించిన జవాన్ ప్రస్తుతం థియేటర్స్ లో ఉంది. కాబట్టి.. డుంకి అప్డేట్ ఇవ్వడం ఆలస్యం అవుతుంది. అంతేగాని సినిమా రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదని.. టీజర్ ని త్వరలో విడుదల చేస్తాం” అని క్రిటిక్ తరన్ ఆదర్శ్ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చేశారు. సో.. డుంకి రిలీజ్ అవుతుంది కాబట్టి.. సలార్ సోలో అనేది కుదరదు. రెండింటి మధ్య బాక్సాఫీస్ వార్ ఎలా ఉండబోతుందో చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి సలార్, డుంకిలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom