Keerthi
ఇటీవలే ముంబైలో భారీ వర్షం కారణంగా ఘాట్‌కోపర్ ప్రాంతంలో సుమారు 250 టన్నులు బరువున్న హోర్డింగ్ ఓ పెట్రోల్ బంకుపై కుప్పకూలిన అయితే ఈ ఘటనలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, వీరిలో స్టార్ హీరో బంధువులు కూడా మృతి చెందారు.
ఇటీవలే ముంబైలో భారీ వర్షం కారణంగా ఘాట్‌కోపర్ ప్రాంతంలో సుమారు 250 టన్నులు బరువున్న హోర్డింగ్ ఓ పెట్రోల్ బంకుపై కుప్పకూలిన అయితే ఈ ఘటనలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, వీరిలో స్టార్ హీరో బంధువులు కూడా మృతి చెందారు.
Keerthi
కార్తీక్ ఆర్యన్.. ఈ పేరు గురించి ప‍్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఈయన కూడా ఒకరు. కేవలం చిన్న సినిమాలతో తన కెరీర్ ను మొదలుపెట్టిన కార్తీక్ నేడు భారీ సినిమాల్లో చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగాడు. ఈ క్రమంలోనే తనదైన నటనతో ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ యంగ్ హీరోకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ స్టార్ హీరో ఇంట్లో ఘోర విషాదం నెలకొంది. ఇంతకి ఏం జరిగిందంటే..
బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఇటీవలే ముంబైలో భారీ హోర్డింగ్ కుప్పకూలిన ఘటన ఇంకా మరువన లేదు. ఆ ఘోరమైన దృశ్యం ఇంక కళ్లముందు కదలాడుతోంది. ఇక ఈ ప్రమాదంలో 16 మంది చనిపోగా, 40 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వాళ్లలో హీరో బంధువులు కూడా ఉన్నారు. తాజాగా వాళ్ల అంత్యక్రియలకు ఈ హీరో హాజరు కావడంతో ఈ విషాద ఘటన బయటపడింది.
కాగా, ముంబైలో సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలోనే.. ఘాట్‌కోపర్ ప్రాంతంలో సుమారు 250 టన్నులు బరువున్న హోర్డింగ్ ఓ పెట్రోల్ బంకుపై కుప్పకూలింది. ఇక ఈ ప్రమాదంలో దాని కింద 100 మంది చిక్కుకుపోయారు. అలాగే ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. అయితే వారిలో హీరో కార్తిక్ ఆర్యన్ అంకుల్ మనోజ్ చన్సోరియా(60), ఆంటీ అనిత (59) కూడా ఉన్నారు. తాజాగా వారి అంత్యక్రియలకు హాజరయిన కార్తీక్ ఆర్యన్ తన బంధువులకు నివాళ‍్లు అర్పించారు. ఇకపోతే హోర్డింగ్ కుప్పకూలిన కేసులో నిందితుడు భవేశ్ పాండేని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఇక కార్తీక్ ఆర్యన్ విషయానికొస్తే.. తాజాగా ఈ హీరో ‘చందూ ఛాంపియన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు బజరంగీ భాయిజాన్, ఏక్ థా టైగర్ చిత్రాల ఫేమ్ దర్శకుడు కబీర్‌ఖాన్ తెరక్కెకించనున్నారు. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను జూన్ 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా,విడుదల తేదీ దగ్గరపడతుండటంతో.. ఈ హీరో ప్రమోషన్స్ లో ఫుల్ బిజిగా ఉన్నాడు. మరీ, ముంబైలో ఇటీవల జరిగిన ప్రమాదంలో కార్తీక్ ఆర్యన్ విషాదం నెలకొనడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
14 killed, 74 injured in this giant hoarding collapse in Mumbai’s dust storm yesterday.
The 17,000 sqft hoarding was listed in the Limca Book of Records last year. The BMC says it was illegal, unauthorised.
FOURTEEN lives gone & counting.
Banana republic. pic.twitter.com/uHqx0tW1in
— Shiv Aroor (@ShivAroor) May 14, 2024