iDreamPost
android-app
ios-app

వారంలోనే రూ.300 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న స్త్రీ-2 మూవీ!

  • Published Aug 23, 2024 | 11:16 AM Updated Updated Aug 23, 2024 | 11:16 AM

Stree 2 Movie Collections: ఈ మధ్యకాలంలో ఆడియన్స్ హరర్ కామెడీ సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాక అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుంటాయి. అందుకు నిదర్శనమే తాజాగా విడుదలైన ఓ హరర్ కామెడీ సినిమా.

Stree 2 Movie Collections: ఈ మధ్యకాలంలో ఆడియన్స్ హరర్ కామెడీ సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాక అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుంటాయి. అందుకు నిదర్శనమే తాజాగా విడుదలైన ఓ హరర్ కామెడీ సినిమా.

  • Published Aug 23, 2024 | 11:16 AMUpdated Aug 23, 2024 | 11:16 AM
వారంలోనే రూ.300 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న స్త్రీ-2 మూవీ!

వారం వారం  పలు జోనర్ సినిమాలు థియేటర్లలో విడుదలై సందడి చేస్తుంటాయి. ఇదే సమయంలో హారర్ కామెడీ సినిమాలను  ఇటీవల ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా వచ్చిన.. కంటెంట్ బాగుంటే.. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంతేకాక అలాంటి మూవీలు  బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతుంటాయి. అందుకు ఉదాహారణగా అనేక సినిమాలు నిలిచాయి. తాజాగా మరో హారర్ కామెడీ మూవీ కూడా  జాబితాలో చేరింది.  వారం రోజుల్లోనే రూ.300కోట్లు సాధించి..బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మరి.. ఆ సినిమా ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఇటీవల హారర్  కామెడీ జానర్ లో విడుదలైన బాలీవుడ్ సినిమా స్త్రీ-2.  ఈ సినిమాలో రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠీ, అభిషేక్ బెనర్జీ, అపర్‌శక్తి ఖురానా నటించారు. స్త్రీ 2 మూవీ ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజైంది.ఈ సినిమా కేవలం ఎనిమిది రోజుల్లోనే రూ.300 కోట్లకు చేరువైంది. Sacnilk.com  ప్రకారం ఈ సినిమా ఎనిమి రోజుల్లోనే కేవలం ఇండియాలోనే రూ.290.85 కోట్లు వసూలు చేసింది. అలానే వర్డల్ వైడ్ గా ఈ సినిమా ఇప్పటికే రూ.400 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది.

ఈ సినిమా రిలీజ్ రోజు కంటే ముందు పెయిడ్ ప్రీమియర్స్ తోనే ఈ సినిమా రూ.8.5 కోట్లు వసూలు చేసింది. రిలీజైన తొలి రోజు అంటే ఆగష్టు 15న రూ.51.8 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజు రూ.31.4 కోట్లు, మూడో రోజు రూ.43.85 కోట్లు, ఐదో రోజు రూ.55.9 కోట్లు వసూలు రాబట్టింది. ఐదేవ రోజు అత్యధికంగా వసూలు సంపాదించింది. దీంతో మొదటి వారాన్ని స్త్రీ-2 సక్సెస్ ఫుల్ గా ముగించింది. అలా మొత్తంగా ఇండియాలోనే 8 రోజుల్లో రూ.290.85 కోట్లు వసూలు చేసింది. అంటే దాదాపు 300కోట్ల మార్క్ ను అందుకుని బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది స్త్రీ-2 మూవీ.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. 2018లో స్త్రీ మూవీ వచ్చి ఎంతో విజయం సాధించింది. ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ స్త్రీ 2 మూవీ తెరకెక్కించారు. మొదటి సినిమా కంటే మంచి టాక్ తో స్త్రీ 2 సినిమా దూసుకెళ్తోంది. స్త్రీ సినిమాలో నటించిన వాళ్లతో  పాటు ఈ సీక్వెల్లో సర్కటా అనే ఓ కొత్త విలన్ ను పరిచయం చేశారు. ఈ స్త్రీ 2 మూవీలోని కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ యాక్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. మూవీ జోరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో భారీ కలెక్షన్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. బాక్సాఫీస్ వద్ద సెక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న స్త్రీ-2 సినిమా కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss