iDreamPost
android-app
ios-app

వీడియో: చనిపోయిన సూర్యకిరణ్ అంత మంచోడా? దివి ఏం చెప్పారంటే..!

  • Published Mar 16, 2024 | 9:01 PM Updated Updated Mar 16, 2024 | 9:01 PM

టాలీవుడ్ డైరెక్టర్ సూర్యకిరణ్ అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గురించి బిగ్​బాస్ ఫేమ్, నటి దివి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

టాలీవుడ్ డైరెక్టర్ సూర్యకిరణ్ అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గురించి బిగ్​బాస్ ఫేమ్, నటి దివి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

  • Published Mar 16, 2024 | 9:01 PMUpdated Mar 16, 2024 | 9:01 PM
వీడియో: చనిపోయిన సూర్యకిరణ్ అంత మంచోడా? దివి ఏం చెప్పారంటే..!

టాలీవుడ్ రచయిత, దర్శకుడు సూర్యకిరణ్ (48) హెల్త్ ఇష్యూస్ వల్ల ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. పచ్చ కామెర్లతో ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతూ ఆయన ప్రాణాలు వదిలారు. చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. సూర్యకిరణ్ మృతిపై ఇండస్ట్రీ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఆయన గురించి సన్నిహితులు పలు విషయాలను పంచుకొని బాధపడుతున్నారు. సూర్యకిరణ్​ సోదరి సుజిత కూడా స్పందించారు. ఆయన తనకు అన్నయ్య మాత్రమే కాదు.. తన హీరో, తన తండ్రి కూడా అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. తాజాగా సూర్యకిరణ్ మృతి మీద ప్రముఖ నటి, బిగ్​బాస్ ఫేమ్ దివి వడ్త్యా రియాక్ట్ అయ్యారు. ఆయన ఎంత మంచోడో, ఆయన మనసు ఎలాంటిదో దివి ఐడ్రీమ్స్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్ చేశారు.

సూర్యకిరణ్​తో బిగ్​బాస్ షో​ నుంచి దివికి మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మృతిపై ఆమె స్పందించారు. ఆయన తనకు చాలా సపోర్ట్ చేశారని అన్నారు దివి. తనతో ఎప్పుడూ సినిమాల గురించి మాట్లాడేవారని చెప్పారు. సూర్యకిరణ్​ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం మాత్రం ఎప్పుడూ పంచుకోలేదని.. ఆ ఒక్కటి మాత్రమే దాచారని తెలిపారు. ‘సూర్యకిరణ్ ఇక లేరనే వార్త విని షాకయ్యా. ఇటీవల ఆయన ఫోన్ చేసి తమిళ సినిమాలో నీకు అవకాశం ఉంది, ఫలానా రోల్​కు నన్ను అనుకుంటున్నామని చెప్పారు. దీంతో హ్యాపీగా అనిపించింది. తమిళ్ డెబ్యూ కోసం నేను వెయిట్ చేస్తున్నా. బిగ్​బాస్​కు ముందు నుంచి సూర్యకిరణ్​తో నాకు పరిచయం ఉంది. ఏదో ఆడిషన్​కు వెళ్లినప్పుడు ఆఫీస్​లో చూశా. బిగ్​బాస్​తో మంచి బాండ్ ఏర్పడింది. ఆ షో తర్వాత కూడా ఆయన నాకు చాలా సార్లు ఫోన్ చేశారు’ అని దివి చెప్పుకొచ్చారు.

సూర్యకిరణ్ ఎప్పుడు కాల్ చేసినా సినిమాల గురించే మాట్లాడేవారని దివి తెలిపారు. అలాంటిది సడన్​గా ఇలా మరణ వార్త విని షాక్ అయ్యానని చెప్పారు. కొందరి లైఫ్ అలా ఎండ్ అయిపోతుందని చెబుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ఎవరితోనూ ఆయన షేర్ చేసుకోలేదని పేర్కొన్నారు దివి. ఎప్పుడు ఫోన్ చేసినా హ్యాపీ న్యూస్ చెబుతారు, కానీ శాడ్ న్యూస్ చెప్పరని వ్యాఖ్యానించారు. దివి నువ్వు చాలా ప్యాషన్​తో ఉన్నావ్, నీకు ఆపర్చునిటీ ఇస్తానని సూర్యకిరణ్​ అనేవారని ఆమె వివరించారు. ఆయన చనిపోయినప్పుడు చాలా ఫీలయ్యానని చెప్పుకొచ్చారు. దివి ఇంటర్వ్యూ చూసిన నెటిజన్స్ సూర్యకిరణ్ ఎంత మంచివారో చెప్పడానికి ఆమె మాటలే బిగ్ ఎగ్జాంపుల్ అని చెబుతున్నారు. తనతో పాటు ఇంకొకరి సక్సెస్ కోసం తపన పడటం, ఎప్పుడూ మంచి విషయాలే పంచుకోవడం సూర్యకిరణ్​ నుంచి అందరూ నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: రెండో పెళ్లికి సిద్ధమైన నటి పావని.. టాటూ మాత్రం అలాగే..

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss