iDreamPost
android-app
ios-app

Gangavva: తన ఆస్తుల వివరాలు బయటపెట్టిన గంగవ్వ! ఎన్ని కోట్లంటే?

  • Published Sep 14, 2024 | 4:39 PM Updated Updated Sep 14, 2024 | 4:39 PM

Gangavva Assets: తెలుగు బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది డబ్బులతో పాటు పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇప్పటికే  ఈషో పాల్గొన్నవారు వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇలా బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన వారిలో గంగవ్వ ఒకరు.

Gangavva Assets: తెలుగు బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది డబ్బులతో పాటు పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇప్పటికే  ఈషో పాల్గొన్నవారు వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇలా బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన వారిలో గంగవ్వ ఒకరు.

  • Published Sep 14, 2024 | 4:39 PMUpdated Sep 14, 2024 | 4:39 PM
Gangavva: తన ఆస్తుల వివరాలు బయటపెట్టిన గంగవ్వ! ఎన్ని కోట్లంటే?

ప్రముఖ రియాల్టీ షోల్లో బిగ్ బాస్ ఒకటి. దేశంలోని అన్ని భాషల్లో ఈ షో ప్రసారం అవుతుంది. తెలుగులో సైతం ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుని.. ఇప్పుడు ఎనిమిదవ సీజన్ ను రన్ చేస్తోంది. ఇక తెలుగు బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది డబ్బులతో పాటు పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇప్పటికే  ఈషో పాల్గొన్నవారు వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇలా బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన వారిలో గంగవ్వ ఒకరు. ఆ షో నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమె ఆర్థికంగా నిలదొక్కున్నారు. బిగ్ బాస్ షో తరువాత కూడా  గంగవ్వ  తనకు నచ్చినట్లుగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది.  ఈ క్రమంలోనే తాజాగా గంగవ్వ తన ఆస్తులు, సంపాదన గురించి  వెల్లడించింది. మై విలేజ్ షో టీమ్ గంగవ్వ ఆస్తుల, సంపాదన గురించి ఓ వీడియోను రిలీజ్ చేసింది.

ఆ వీడియోలు గంగవ్వ మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న తరువాత తన జీవితం చాలా మారిందంటూ తాను ఉంటున్న ఇల్లును చూపించింది. ఆ షో తరువాతే  ఈ ఇంటిని నిర్మించానని, దానికి రూ.22 లక్షలు అయిందని తెలిపింది. తనకు  ఉన్న ఆవుల కోసం రేకుల షెడ్డును కూడా ఏర్పాటు చేసినట్లు గంగవ్వ తెలిపింది. అలాగే ఆ ఆవుల కోసం గడ్డిని కూడా పెంచుతున్నాని తెలిపింది. ఇక ఆవులను కొనుగోలు చేసేందుకు రూ.3 లక్షలు ఖర్చైనట్లు తెలిపింది. మరో రూ.9 లక్షలు పెట్టి నాలుగు కుంటల స్థలం కొనుగోలు చేసినట్లు తెలిపింది.

అదే విధంగా మరో ప్రాంతంలో రెండున్నర ఎకరాల పొలం ఉందని, దాని విలువ రూ.75 నుంటి 80 లక్షల మధ్య ఉంటుందని తెలిపింది. ఇంకోచోట కమర్షియల్ ప్లాట్ కూడా కొనుగోలు చేసినట్లు పేర్కొంది. వీటన్నిటితో పాటు మరికొన్నిచోట్ల వ్యవసాయ భూమిలు కూడా ఉన్నాయని తెలిపింది. ఇక తన పొలం, ఆవులు, ఇతర స్థలాలు, ఇల్లు మొత్తంగా కలిపి తన ఆస్తుల విలువ రూ.కోటి 30 లక్షల వరకు ఉంటుందని గంగవ్వ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. తన సంపాదనలో కూతుర్లిద్దరికి చెరో  రెండు లక్షలు, మనవరాలి పెళ్లికి రూ.2.5 లక్షలు ఇచ్చినట్లు గంగవ్వ వెల్లడించింది. బిగ్ బాస్ హౌస్ లో తనకి వచ్చిన డబ్బులతో మనవరాలి పెళ్లి చేసినట్లు గంగవ్వ తెలిపింది.

ఇక గంగవ్వ గురించి చూసినట్లు అయితే బిగ్ బాస్ షోకి రాకముందు ఆమె  మై విలేజ్ షో అనే  యూట్యూబ్ వీడియోల్లో నటించింది. అక్కడ తనదైన యాసతో అందరిని ఆకట్టుకుంది. ఈ వీడియోల ద్వారా గంగవ్వ ఎంతో ఫేమస్ అయ్యింది. ఈ షో ద్వారా  పబ్లిసిటీ సంపాదించుకున్న గంగవ్వ అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ 4లో అడుగుపెట్టింది.  హౌస్ లో ఉన్నన్ని రోజులు బాగానే ఎంటర్టైన్ చేసింది. మొత్తంగా ఆ షో తరువాత నుంచి గంగవ్వ మరింత ఫేమస్ అయ్యారు. తాజాగా గంగవ్వ తెలిపిన తన ఆస్తుల వివరాలకు సంబంధించిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş