బిగ్ బాస్ తెలుగు అప్పుడు ఏడో సీజన్ లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ ప్రారంభం కాబోతోంది అనగానే బుల్లితెర ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే ఉత్సాహం రెట్టింపు అవుతోంది. ఎవరెరవరు హౌస్ లోకి వస్తారు? ఈసారి ఎలాంటి టాస్కులు ఉంటాయి? ఎవరికి ఓటు వేయాలి? అంటూ నానా హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించే చర్చ జరుగుతోంది. ఈ సీజన్ కి సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినా కూడా ఇట్టే వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అతి త్వరలోనే ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బిగ్ బాస్ 7 లోగో రివీల్ చేస్తూ చిన్న ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈసారి సీజన్ లోగో కూడా కొత్తగా అనిపించింది. పర్పుల్, లైట్ బ్లూ కలర్స్ కాంబినేషన్ లో ఈ నేమ్ డిజైన్ చేశారు. అదే ఐకానిక్ మ్యూజిక్ తో కొత్త లోగో ఆకర్షిస్తోంది. అలాగే ఎవరెవరు ఇంట్లోకి వెళ్తారు? ఎవరు వెళ్తే బాగుంటుంది? అంటూ ఊహాగానాలు, ప్రిడిక్షన్స్ కూడా మొదలు పెట్టారు.
ప్రతి సీజన్ లో సభ్యులు, గేమ్స్, టాస్కులకు మాత్రమే కాదు.. బిగ్ బాస్ సెట్ కు కూడా ఎంతో మంది అభిమానులు ఉంటారు. కొందరైతే ఆ ఇల్లు సెట్ చూసేందుకే ఎపిసోడ్స్ ఫాలో అయ్యేవాళ్లు కూడా ఉంటారు. ఈ సీజన్ సెట్ ఎలా ఉండబోతోంది అంటూ అప్పుడే కొందరు అడగడం మొదలు పెట్టారు. అలాంటి వారికి ఈ లీక్డ్ వీడియో చూపించండి. ఎందుకంటే సీజన్ 7కి సంబంధించిన సెట్ వీడియో ఒకటి ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో హల్ చల్ చేస్తోంది. చాలా సీజన్స్ తో పోలిస్తే.. ఈ సీజన్ సెట్ అద్భుతంగా ఉంటుంది అని చెబుతున్నారు. డిజైన్స్, బెడ్ రూమ్, ఇంటీరియర్ కూడా యునీక్ గా ఉంటుందని చెబుతున్నారు. కచ్చితంగా బుల్లితెర ప్రేక్షకులకు నచ్చుతుందని ఈ లీకుల వీరులు హామీ ఇస్తున్నారు.
ఇప్పుడు ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క విషయం లీక్ అవుతుందని తెలిసిందే. అయితే బిగ్ బాస్ లో ఆ లీకులు మరీ ఎక్కువగా ఉంటాయి. రేపటి ఎపిసోడ్ లో నాగార్జున ఏ డ్రెస్ వేసుకుంటాడు మొదలు.. ఎంట్రీ సాంగ్ ఏంటి? ఎవరు నామినేషన్స్ లో ఉంటారు కూడా చెప్పేస్తారు. అంతేకాకుండా ఏ వీక్ లో ఎవరు ఎలిమినేట అవ్వబోతున్నారు అనే విషయాన్ని కూడా ఎంతో క్లియర్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఉండే మీమ్ పేజెస్, బీబీ అప్ డేట్ పేజెస్ చెప్పేస్తుంటాయి. ఇంక ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విషయానికి వస్తే.. సెప్టెంబర్ మొదటి వారంలో సీజన్ ప్రారంభం అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.