iDreamPost
android-app
ios-app

లియోలో ఎక్స్ పెక్ట్ చేయని స్టార్ హీరో! క్యామియో రోల్ కన్ఫర్మ్?

  • Author ajaykrishna Updated - 11:40 AM, Mon - 16 October 23
  • Author ajaykrishna Updated - 11:40 AM, Mon - 16 October 23
లియోలో ఎక్స్ పెక్ట్ చేయని స్టార్ హీరో! క్యామియో రోల్ కన్ఫర్మ్?

ప్రస్తుతం ఇండస్ట్రీలో లియో ఊపు గట్టిగానే కనిపిస్తుంది. దళపతి విజయ్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా.. దసరా సందర్బంగా అక్టోబర్ 19న రిలీజ్ అవుతోంది. విజయ్ కెరీర్ పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ ఇది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ అవుతోంది. కాగా.. రిలీజ్ కి ఇంకా మూడు రోజులే ఉండటంతో ఫ్యాన్స్ హైప్ రడబుల్ అయిపోయింది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ లతో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న లియో.. థియేట్రికల్ టికెట్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఓవర్సీస్ లో లియో ప్రీసేల్స్ అదిరిపోయాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో.. లియో మూవీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కావడంతో.. ఈ సినిమా కూడా ‘LCU’లో భాగం అని అందరు భావిస్తున్నారు. కట్ చేస్తే.. ఇప్పటిదాకా లోకేష్ కూడా లియో.. తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అని కన్ఫర్మ్ చేయలేదు. కానీ.. వరుస ఇంటర్వ్యూలలో కొన్ని క్లూస్ అయితే వదులుతున్నాడు. గతేడాది విక్రమ్ రిలీజ్ టైమ్ లో ముందు ఖైదీ చూసి.. విక్రమ్ కి వెళ్లాలని అన్నాడు. అలా ఆ సినిమాకు సూపర్ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో విక్రమ్ మూవీ.. కమల్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టి.. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు లియో సినిమాకు కూడా ఓ కిక్కిచ్చే హింట్ ఇచ్చాడు.

అదేంటంటే.. లియో మూవీ ఫస్ట్ పది నిముషాలు అసలు మిస్ అవ్వొద్దు అని చెప్పాడు. దీంతో ఇప్పుడు లియో స్టార్టింగ్ లో ఏం జరుగుతుంది? ఎందుకు లోకేష్ అలా చెప్పాడు? లియో.. LCU లో ఎలా లింక్ చేసాడనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా.. లియోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్యామియో ఉందని ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది. కానీ.. అందులో ఎలాంటి నిజం లేదని సినీ వర్గాల టాక్. లియోలో రామ్ చరణ్ లేడు.. ఆ స్థానంలో మరో హీరో క్యామియో ఉందని అంటున్నారు. ఆ హీరో ఎవరో కాదు.. కమల్ హాసన్. అవును.. కమల్ లియోలో క్యామియో ఎంట్రీ చేశాడని వినికిడి. ఒకవేళ ఇదే నిజమైతే లియో.. LCU లో భాగమై రికార్డులు కొల్లగొట్టడం కన్ఫర్మ్. చూడాలి కమల్ ఉన్నారో లేదో! మరి లియో మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş