iDreamPost
android-app
ios-app

మెగాస్టార్ ‘భోళా శంకర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

  • Author singhj Published - 07:46 PM, Fri - 11 August 23
  • Author singhj Published - 07:46 PM, Fri - 11 August 23
మెగాస్టార్ ‘భోళా శంకర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్​టైనర్​గా రూపొందిన ఈ మూవీ శుక్రవారం బిగ్​స్క్రీన్స్​లో రిలీజైంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేశారు. ఇందులో చిరుతో పాటు స్టార్ హీరోయిన్లు కీర్తి సురేష్, తమన్నా నటించారు. అయితే ‘భోళా శంకర్​’కు మిక్స్​డ్ టాక్ వచ్చేసింది. ఇందులో ఫైట్లు, డ్యాన్సులతో పాటు కామెడీతో చిరంజీవి ఎప్పటిలాగే ఆకట్టుకున్నారని ఆడియెన్స్ అంటున్నారు.

చిరంజీవి నటనకు తోడు మహతీ స్వరసాగర్ కంపోజ్ చేసిన పాటలు, బీజీఎం ‘భోళా శంకర్​’కు హైలైట్ అని చెబుతున్నారు. ఈ రెండు విషయాలు తప్పితే సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ లేవని విమర్శకులు అంటున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం చిరు డ్యాన్సులు, ఫైట్లు చూద్దామనుకొని వెళ్తే ‘భోళా’ నచ్చుతుందని చెబుతున్నారు. తమిళ బ్లాక్​బస్టర్ ‘వేదాళం’కు రీమేక్​గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఒరిజినల్​లో ఉండే సిస్టర్ సెంటిమెంట్, ఎమోషన్స్, డ్రామా ఇక్కడ సరిగ్గా పండలేదని అంటున్నారు. మిక్స్​డ్ టాక్ తెచ్చుకున్న ‘భోళా శంకర్’ ఏ మేరకు కలెక్షన్లు సాధిస్తాడో చూడాలి. ఇక, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ నటించిన మూవీ కావడంతో ‘భోళా’పై ప్రేక్షకుల్లో హై రేంజ్​లో అంచనాలు ఏర్పడ్డాయి.

‘భోళా శంకర్’పై ఉన్న ఎక్స్​పెక్టేషన్స్ కారణంగా దీని డిజిటల్ స్ట్రీమింగ్​ రైట్స్​ను ఎవరు సొంతం చేసుకుంటారనే విషయంపై సందిగ్ధత నెలకొంది. అయితే ‘భోళా’ డిజిటల్ రైట్స్​ను ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్ దక్కించుకుందని మూవీ యూనిట్ వెల్లడించింది. ఈ విషయాన్ని ‘భోళా శంకర్’ టైటిల్ కార్డ్స్​ మీద వేసి క్లారిటీ ఇచ్చింది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. ఈ లెక్కన సెప్టెంబర్ రెండో వారంలోనే ‘భోళా’ స్ట్రీమింగ్​కు వచ్చేస్తుందని టాక్. మరి.. ‘భోళా శంకర్​’ మూవీని చూశారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.