మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో అభిమానుల్లో చిరు జోష్ నింపారు. ప్రమోషన్స్ కూడా హిట్ అవ్వడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ టైమ్‌లో ‘భోళా శంకర్’ రిలీజ్‌ను ఆపేయాలంటూ ఒకరు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర తనను మోసం చేశారంటూ ‘ఏజెంట్’ మూవీ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన ‘భోళా శంకర్’ విడుదలను నిలిపివేయాలంటూ పిటిషన్ వేశారు. దీంతో అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ అవుతుందా.. లేదా? అనే సందేహం ఏర్పడింది.
నిర్మాత అనిల్ సుంకరపై వైజాగ్ సతీష్ వేసిన పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ‘భోళా శంకర్’ రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది. ఆగస్టు 11న మెగాస్టార్ నయా మూవీ వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక కాంట్రవర్సీ విషయానికొస్తే.. ‘భోళా శంకర్’ ప్రొడ్యూసర్‌గా ఉన్న ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర.. తనకు పెండింగ్ బకాయిలు చెల్లించలేదని విశాఖపట్నానికి చెందిన గాయత్రి ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ‘ఏజెంట్’ మూవీ డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి అనిల్ తనకు ఇంకా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉందని ఆయన ఆరోపించారు.
అనిల్ సుంకర నుంచి తనకు రావాల్సిన బకాయిలు క్లియర్ అయ్యేంత వరకు ‘భోళా శంకర్’ రిలీజ్‌ను నిలిపివేయాలని కోర్టును కోరారు వైజాగ్ సతీష్. ఈ న్యూస్ తెలియడంతో మెగా ఫ్యాన్స్‌లో ఈ మూవీ ఆగస్టు 11న విడుదల అవుతుందా.. లేదా? అదే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు.. అనిల్ సుంకరకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కాగా, కోర్టులో సతీష్ నకిలీ పత్రాలను సమర్పించారని ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఆరోపించింది. మొత్తానికి ‘భోళా శంకర్’ రిలీజ్‌కు లైన్ క్లియర్ అవడంతో మెగా అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.