iDreamPost
android-app
ios-app

గామి – భీమా ఓపెనింగ్స్: బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఎలా చేశాయంటే…

  • Published Mar 09, 2024 | 12:54 PM Updated Updated Mar 09, 2024 | 12:54 PM

మహాశివరాత్రి సందర్భంగా టాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద రెండు విభిన్న చిత్రాలు పోటీ పడ్డాయి. అందులో ఒకటి విశ్వక్ సేన్ నటించిన అడ్వెంచర్ - సౌల్ సర్చింగ్ డ్రామా గామి అయితే, మరొకటి గోపీచంద్ నటించిన మాస్ యాక్షన్ డ్రామా భీమా. అయితే ఈ రెండు చిత్రాల్లో తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఏదీ ఎక్కువగా కమర్షియల్ గా కలెక్షన్లు వసూలు చేసిందంటే..

మహాశివరాత్రి సందర్భంగా టాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద రెండు విభిన్న చిత్రాలు పోటీ పడ్డాయి. అందులో ఒకటి విశ్వక్ సేన్ నటించిన అడ్వెంచర్ - సౌల్ సర్చింగ్ డ్రామా గామి అయితే, మరొకటి గోపీచంద్ నటించిన మాస్ యాక్షన్ డ్రామా భీమా. అయితే ఈ రెండు చిత్రాల్లో తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఏదీ ఎక్కువగా కమర్షియల్ గా కలెక్షన్లు వసూలు చేసిందంటే..

  • Published Mar 09, 2024 | 12:54 PMUpdated Mar 09, 2024 | 12:54 PM
గామి – భీమా ఓపెనింగ్స్: బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఎలా చేశాయంటే…

ఈ శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద రెండు విభిన్న చిత్రాలు పోటీ పడ్డాయి. అందులో ఒకటి విశ్వక్ సేన్ నటించిన అడ్వెంచర్ – సౌల్ సర్చింగ్ డ్రామా గామి అయితే, మరొకటి గోపీచంద్ నటించిన మాస్ యాక్షన్ డ్రామా భీమా. ఈ రెండు చిత్రాల తొలి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, గామి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా అయినప్పటికీ మాస్ కమర్షియల్ సినిమా అయినా భీమా కంటే కాస్త ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది.

గామి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దాదాపు రూ. 4.5 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, భీమా రూ.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆసక్తికరంగా, సీడెడ్ వంటి మాస్ ఏరియాలో గామి సినిమా ఊహించిన దానికంటే మంచి ఓపెనింగ్స్ సాధించింది. దాదాపు 55 లక్షల గ్రాస్ తెచ్చుకుని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపడింది. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి న్యూ ఏజ్ సినిమాలు సీడెడ్ లో అంతగా ఆడవు. ఇక గామి యూఎస్ లో కూడా ఈ చిత్రం అద్భుతమయిన ఓపెనింగ్స్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇప్పటివరకు యూఏస్ లో $265K కంటే ఎక్కువ వసూలు చేసింది, దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా గామి కలెక్షన్స్ బాగా వస్తాయి.

మొత్తానికి విశ్వక్ సేన్ నటించిన గామి చిత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ నోట్‌తో ప్రారంభమైంది, అయితే గోపీచంద్ భీమా మాత్రం సాధారణ కలెక్షన్ల తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే మాస్ సినిమా కాబట్టి శనివారం ఆదివారం బీ, సీ సెంటర్స్ ప్రేక్షకులు ఈ సినిమాని చూసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఆ రకంగా ఈ వీకెండ్ బాక్సాఫీస్ రన్ పూర్తయ్యాక మొత్తం మీద రెండు సినిమాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలుస్తుందో తెలుస్తుంది. ప్రస్తుతానికయితే గామి సినిమా ముందంజలో ఉంది.

శివరాత్రి బాక్సాఫీస్ – గామి శివోహం

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet