iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో చిన్నారి చదివింది ‘లా‘.. మారింది నటిలా.. గుర్తు పట్టారా?

  • Published Mar 04, 2024 | 6:29 PM Updated Updated Mar 04, 2024 | 6:29 PM

ఈ ఫోటోలో అమ్మ వీపుపై కూర్చుని ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.. చదువుకుందేమో లా.. కానీ మారింది నటిలా.. యంగ్ హీరోల సరసన ఆడిపాడుతుందిలా. ఆ బ్యూటీ ఎవరంటే..

ఈ ఫోటోలో అమ్మ వీపుపై కూర్చుని ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.. చదువుకుందేమో లా.. కానీ మారింది నటిలా.. యంగ్ హీరోల సరసన ఆడిపాడుతుందిలా. ఆ బ్యూటీ ఎవరంటే..

  • Published Mar 04, 2024 | 6:29 PMUpdated Mar 04, 2024 | 6:29 PM
ఈ ఫోటోలో చిన్నారి చదివింది ‘లా‘.. మారింది నటిలా.. గుర్తు పట్టారా?

ఇప్పుడు హీరోయిన్లు అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అంత కంటే తెలివైన వాళ్లు కూడా. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకున్నప్పుడే కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్లు విద్యాభ్యాసం పూర్తి చేసి.. ఎంత కొంత ఉద్యోగ అనుభవం సంపాదించి ఆ తర్వాత నటిగా నిరూపించుకునేందుకు ఇటుగా పయనం అవుతున్నారు. ఇక్కడ బెడిసి కొడితే.. బ్యాక్ టు పెవిలియన్ అన్నట్లుగా భావిస్తున్నారు. ఇప్పుడు ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన హీరోయిన్లలో నూటికి 90 శాతం మంది మంచి ఉన్నత చదువులు చదివిన వారే. డాక్టర్స్, ఇంజనీర్స్ లాంటి ఏదో ఒక డిగ్రీ పట్టా పొందిన వాళ్లే.. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా ఆ కోవకే వస్తుంది.. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది.. అన్నట్లుగా ఉంది ఈమె కెరీర్.

ఫోటోలో అమ్మ వీపుపై కూర్చుని ఆడుకుంటున్న ఈ పాపను చూశారా.. ఎంత క్యూట్‌గా నవ్వుతోంది కదా. వైట్ గౌనులో ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ బ్యూటీకి ముందే తెలుసేమో తాను హీరోయిన్ అవుతానని.. ఏ మారం చేయకుండా ఫోటో దిగుతుంది. పుట్టి, పెరిగింది ముంబయిలో.. కానీ తెలుగు రాష్ట్రాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈ లిటిల్ వన్. ప్రస్తుతం యువ హీరోల సరసన ఆడి పాడుతున్న ఈ సుందరి.. త్వరలో మరో సినిమాతో సందడి చేయబోతోంది. ఇంతకు ఆమె ఎవరంటే మాళవిక శర్మ . చదివింది లా.. క్రిమినాలజీలో స్పెషలైజేషన్ చేసింది ఈ ముంబయి ముద్దుగుమ్మ. కానీ యాక్టింగ్ పై ఫ్యాషన్‌తో తొలుత మోడల్‌గా రాణించి.. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. జియోన్ మొబైల్, హిమాలయ హెర్బల్ ఫేష్ వాష్, మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్, సంతూర్ డియోడ్రెంట్ వంటి యాడ్స్‌లో నటించింది అమ్మడు.

2018లో రవితేజ నేల టిక్కెట్ మూవీతో నటిగా తెరంగేట్రం ఇచ్చింది. ఆ తర్వాత యంగ్ హీరో రామ్ సరసన రెడ్ చిత్రంలో ఆడి పాడింది. అటు తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. కాఫీ విత్ కాదల్ అనే పిక్చర్‌లో కనిపించింది. ప్రస్తుతం మ్యాచో మ్యాన్ గోపిచంద్ అప్ కమింగ్ మూవీ భీమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. మార్చి 8న విడుదల కాబోతుంది ఈ చిత్రం. అందులో విద్య అనే క్యారెక్టర్ చేస్తుంది ఈ అడ్వకేట్. ఇది కాకుండా మరో సినిమా చేస్తోంది. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న హరోం హరా అనే చిత్రంలో నటిస్తోంది. దీనికి జ్ఞాన సాగర్ ద్వారక దర్శకుడు. చేసినవీ తక్కువ సినిమాలే అయినా.. చూసీగా చేసుకుంటూ పోతుంది మాళవిక శర్మ. ఈ రెండు చిత్రాల్లో ఏదీ హిట్ టాక్ కొట్టినా.. అమ్మడి రేంజే మారిపోతుంది. వరుసగా ఆఫర్లను వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏమో ఎవరు చెప్పగలరు. ఏమంటారు..?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss