iDreamPost
android-app
ios-app

ఈ పాప ఇప్పుడో క్రేజీ హీరోయిన్.. టైర్ 2 హీరోలను మడతపెట్టేస్తుంది

  • Published Mar 09, 2024 | 5:37 PM Updated Updated Mar 09, 2024 | 5:37 PM

ఈ ఫోటోలో తదేకంగా చూస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేసేందుకు సిద్ధమౌతుంది. వరుసగా టైర్ 2 హీరోలను మడతపెట్టేస్తోంది అమ్మడు.

ఈ ఫోటోలో తదేకంగా చూస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేసేందుకు సిద్ధమౌతుంది. వరుసగా టైర్ 2 హీరోలను మడతపెట్టేస్తోంది అమ్మడు.

  • Published Mar 09, 2024 | 5:37 PMUpdated Mar 09, 2024 | 5:37 PM
ఈ పాప ఇప్పుడో క్రేజీ హీరోయిన్.. టైర్ 2 హీరోలను మడతపెట్టేస్తుంది

ఒక్కో మెట్టు ఎదుగుతూ హీరోయిన్ కావడం అంటే మామూలు విషయం కాదూ. నేరుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం వేరు. చేస్తున్న రంగంలో రాణిస్తూ.. నటిగా ప్రయాణం మొదలు పెట్టడం వేరు. వడివడిగా అడుగులు వేసుకుంటూ తాము సాధించాలన్న లక్ష్యాన్ని చేరుకుంటున్నారు కొందరు. అందిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఒక్క ఛాన్స్ వీరి దశ దిశను మార్చేస్తుంది. నయన తార, సమంతల నుండి నేటి అనసూయ వరకు ఇలా తమ కెరీర్ నిర్మించుకున్న వారే. తొలి నాళ్లలో టీవీ యాడ్స్ లేదా న్యూస్ ప్రజెంటర్‌గా పని చేస్తూ.. ఆ తర్వాత హీరోయిన్లుగా మారి.. ఇప్పుడు విజయ పతాకాన్ని ఎగుర వేస్తున్నారు. ఆ కోవలేకో వస్తుంది ఈ ఫోటోలోని చిన్నారి కూడా.

స్కూల్ డ్రెస్సులో తదేకంగా చూస్తున్న ఈ పాపను గుర్తు పట్టారా.. క్రేజీ నటి. ఈ అమ్మడి పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. టెలివిజన్ రంగంలో రాణించి.. ఆ తర్వాత నటిగా బిజీగా మారింది. న్యూస్ రీడర్‌గా, టీవీ సీరియల్ నటిగా, సెకండ్ హీరోయిన్‌గా చేస్తూ.. ఇప్పుడు టైర్ 2 హీరోలకు సరైన జోడీగా మారింది. తమిళ హీరోలతో ఆడిపాడిన అమ్మడు తెలుగులో కూడా నాగ చైతన్య, గోపీచంద్, సంతోష్ శోభన్, సత్య వంటి యంగ్ స్టార్స్ సరసన ఆడిపాడుతోంది. ఇంతకు ఈ బేబి ఎవరంటే.. ప్రియ భవానీ శంకర్. కోలీవుడ్ నాట టీవీ రంగంలో అడుగుపెట్టిన అమ్మడు.. న్యూస్ రీడర్, సీరియల్స్ చేసింది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన మేయాద మాన్ అనే చిత్రంతో బిగ్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది. జీవా, కార్తీ, ఎస్ జె సూర్య, అశోక్ సెల్వన్, ధనుష్ వంటి స్టార్ పక్కన నటించింది.

సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన కళ్యాణం, కమనీయం చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ 34 ఏళ్ల బ్యూటీ.. ధనుష్ తిరు మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. విక్రమ్ కె కుమార్- నాగ చైతన్య కాంబోలో వచ్చిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూతలో నటించింది ప్రియ. నాగ చైతన్య భార్యగా మోస్ట్ కరెప్టెడ్ జర్నలిస్టుగా  మెప్పించింది. మ్యాచో మ్యాన్ గోపీచంద్ సరసన భీమాలో ఆడిపాడింది ఈ కోలీవుడ్ సోయగం. ఇవే కాదూ తమిళంలో కూడా రెండు వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం తెలుగులో సత్యదేవ్ జీబ్రా అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇవే కాకుండా డీమాంటీ కాలనీ 2, రత్నం, ఇండియన్ 2 వంటి చిత్రాల్లో యాక్ట్ చేస్తోంది. ఈమె రాజ్ వేల్ అనే యువకుడితో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigbossgrandpashabet