iDreamPost
android-app
ios-app

Bheemla Nayak Collections : వేగంగా వంద కోట్ల క్లబ్బులోకి పవన్ సినిమా

  • Published Feb 28, 2022 | 1:55 PM Updated Updated Feb 28, 2022 | 1:55 PM
  • Published Feb 28, 2022 | 1:55 PMUpdated Feb 28, 2022 | 1:55 PM
Bheemla Nayak Collections : వేగంగా వంద కోట్ల క్లబ్బులోకి పవన్ సినిమా

మొన్న శుక్రవారం విడుదలైన భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. మూడు రోజులు కంప్లీట్ గా తన కంట్రోల్ లోకి తీసుకుని పోటీ లేని అడ్వాంటేజ్ ని పూర్తిగా వాడేసుకుంది. వలిమై కనీస స్థాయిలో ప్రతిఘటించకపోవడంతో థియేటర్లన్నీ పవన్ సినిమాతోనే ఊగిపోతున్నాయి. ఇవాళ సోమవారం నుంచి అసలు పరీక్ష ప్రారంభం కానుంది. యావరేజ్ టాక్ ఉన్నా, సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చినా పవర్ స్టార్ మూవీ మొదటి రోజులు ఇలాగే ఉంటుంది కాబట్టి వీక్ డేస్ పెర్ఫార్మన్స్ చాలా కీలకంగా మారనుంది. ఇప్పటికైతే హైదరాబాద్ లాంటి నగరాల్లో పర్లేదు కానీ జిల్లా కేంద్రాలు, బిసి సెంటర్స్ డ్రాప్ ఉండే అవకాశాలు లేకపోలేదు.

మొత్తం మూడు రోజులకు కలిపి భీమ్లా నాయక్ 69 కోట్ల దాకా వసూలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్. బ్రేక్ ఈవెన్ కి ఇంకో నలభై కోట్ల దాకా రాబట్టాలి కానీ ఇదే ఊపు కొనసాగితే అదేమంత కష్టం కాదు. ఈ శుక్రవారం ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్, బ్యాట్ మ్యాన్ లు వస్తున్నాయి. వాటి ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దాన్ని బట్టి భీమ్లా తగ్గడమా పెరగడమా ఆధారపడి ఉంటుంది. అవి ఎలా ఉన్నా మళ్ళీ వీకెండ్ కి మంచి ఫిగర్స్ నమోదయ్యే ఛాన్స్ ఉంది. నైజామ్ లో టికెట్ ధరలు అధికంగా ఉండటం ఫ్యామిలీ ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో రాకపోవడానికి కారణమవుతోంది. రెండో వారం తగ్గిస్తే బెటర్. ముందు ఏరియాల వారి లెక్కలు చూద్దాం

నైజాం – 25 కోట్ల 85 లక్షలు
సీడెడ్ – 7 కోట్లు
ఉత్తరాంధ్ర – 4 కోట్ల 65 లక్షలు
గుంటూరు – 3 కోట్ల 85 లక్షలు
ఈస్ట్ గోదావరి – 3 కోట్ల 60 లక్షలు
వెస్ట్ గోదావరి – 3 కోట్ల 90 లక్షలు
కృష్ణా – 2 కోట్ల 30 లక్షలు
నెల్లూరు – 1 కోటి 80 లక్షలు

ఏపి / తెలంగాణ 3 రోజుల షేర్ – 52 కోట్ల 96 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా – 6 కోట్ల 7 లక్షలు
ఓవర్సీస్ – 10 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా టోటల్ వీకెండ్ షేర్ – 69 కోట్ల 5 లక్షలు

అసలైన వీక్ డేస్ సవాల్ ని భీమ్లా ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి. ఇంకో నలభై కోట్లంటే మాటలు కాదు. చాలా దూరం వెళ్ళాలి. ఇప్పడంటే నెంబర్స్ ఈజీగా వచ్చినట్టు కనిపిస్తుంది కానీ ముందు ముందు ఇది హోల్డ్ చేయడం కీలకం. అఖండ ఈ విషయంలో బాగా సక్సెస్ అయ్యింది. అదే దారిలో భీమ్లా కనక స్టడీ రన్ కొనసాగిస్తే ప్రాఫిటబుల్ వెంచర్ అవుతుంది. థియేట్రికల్ బిజినెస్ ఎక్కువగా జరగడం వల్ల టార్గెట్ మరీ పెద్దదైపోయింది. లేదంటే ఇప్పుడొచ్చిన మూడు భీమ్లా నాయక్ షేర్ షేర్ వేరే మీడియం రేంజ్ హీరో ఫుల్ రన్ లో కూడా రాదు. యుఎస్ లో 2 మిలియన్ మార్కు దాటడమే కాదు 100 కోట్ల గ్రాస్ ని కేవలం మూడు రోజుల్లో అందుకోవడం రికార్డే

Also Read : Love Hostel Report : లవ్ హాస్టల్ రిపోర్ట్

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş