iDreamPost
android-app
ios-app

ఊరు పేరు భైరవకోన ఒక్కటే మూవీ కాదు.. సీక్వెల్- ప్రీక్వెల్ కూడా!

  • Published Feb 14, 2024 | 4:59 PM Updated Updated Feb 14, 2024 | 4:59 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి కంటెంట్ తో సినిమాలు తీసే వారిలో హీరో సందీప్ కిషన్ ఒకరు. తాజాగా ఈ హీరో నటించిన చిత్రం "భైరవకోన". అయితే ఈ చిత్రానికి సంబంధించి మరో లేటెస్ట్ అప్ డేట్ ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి కంటెంట్ తో సినిమాలు తీసే వారిలో హీరో సందీప్ కిషన్ ఒకరు. తాజాగా ఈ హీరో నటించిన చిత్రం "భైరవకోన". అయితే ఈ చిత్రానికి సంబంధించి మరో లేటెస్ట్ అప్ డేట్ ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

  • Published Feb 14, 2024 | 4:59 PMUpdated Feb 14, 2024 | 4:59 PM
ఊరు పేరు భైరవకోన ఒక్కటే మూవీ కాదు.. సీక్వెల్- ప్రీక్వెల్ కూడా!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలే కాకుండా .. వారితో పోటీ పడుతున్న ఎంతో మంది మిగిలిన హీరోలు కూడా ఉన్నారు. ప్రతి సారి వారు కూడా మంచి కంటెంట్ తో .. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ, కొన్ని సార్లు ఎదో ఒక లోపం వలన వారి సినిమాలు ఆడియన్సును అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు. ఈ క్రమంలో .. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎంతో మంది ఉన్నారు. ఈ కోవకు చెందినవాడే హీరో “సందీప్ కిషన్”. ఎప్పటికపుడు తన లుక్ ని మార్చుకుని.. ప్రేక్షకులకు కొత్తగా కనిపిస్తూ.. మంచి కంటెంట్ ను అందిస్తూ ఉంటాడు ఈ హీరో. కానీ, ఈ హీరో కెరీర్ లో సక్సెస్ చూసి చాలా కాలమే అయిందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో తీసిన ఏ కొత్త సినిమా ఆడియన్సును ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ హీరో తాజాగా నటించిన చిత్రం “భైరవ కోన”. అయితే, ఈ చిత్రానికి సంబంధించి మరో లేటెస్ట్ న్యూస్ .. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

అయితే, “భైరవ కోన” చిత్రానికి వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, మొదట ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేసిన మేకర్స్ .. ముందుగానే వారి చిత్రానికి స్పెషల్ షోస్ వేస్తున్నారు. గతంలో సందీప్ కిషన్ , వీఐ ఆనంద్‌ కాంబినేష‌న్ లో టైగ‌ర్ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కానీ , అది అంతగా పేరు సంపాదించుకోలేదు. ఈ క్రమంలోనే మరోసారి వీరిద్దరూ కాంబినేషన్ లో ఇప్పుడు వస్తున్న చిత్రం “భైరవ కోన”. మ‌రి సినిమా ఎలా ఉంది అనేదే తెలియాలంటే పూర్తి రివ్యూ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమా మౌత్ టాక్ బాగానే ఉంది. అయితే, ఈ చిత్రానికి ఈ సినిమాకి ప్రీక్వెల్..సీక్వెల్ కూడా ఉంటుందని.. నిర్మాత రాజేష్ దండా ఓ ఇంట‌ర్వ్యూలో తెలియజేశారు. ప్రీక్వెల్..సీక్వెల్ చేసే అవ‌కాశం అయితే ఉంది కానీ.. దానికి సంబంధించి సినిమా చివ‌ర్లో మాత్రం ఎలాంటి లీడ్ ఇవ్వలేదని పేర్కొన్నారు. అలాగే తానూ డిస్ట్రిబ్యూట‌ర్ గా 12 ఏళ్లు ప‌నిచేసిన త‌ర్వాత నిర్మాణం వైపు వచ్చానని కూడా తెలియజేశారు. అంతే కాకుండా తానూ, సందీప్ , వి.ఐ ఆనంద్ చాలా కాలంగా స్నేహితులైన కారణంగా.. ఈ సినిమా సాధ్యపడుతోందని పేర్కొన్నారు.

కాగా, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ద‌ర్శ‌కుడు రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కథ పురాణ‌ల‌తో ముడిపడి ఉన్నట్లు.. దీనిలో ఓ కొత్త అంశాన్ని చర్చినట్లు తెలియజేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ను చూస్తుంటే .. ఇదొక సూపర్ నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం అని అర్థమౌతోంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్యతాపర్ ప్రధాన పాత్రలలో నటించారు. కాగా, ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. మరి ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయిన తర్వాత ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి , “భైరవ కోన” చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ సెక్వెల్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet