iDreamPost
android-app
ios-app

కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన బెల్లంకొండ

  • Published Sep 13, 2025 | 10:22 AM Updated Updated Sep 13, 2025 | 10:22 AM

హీరోలన్నాకా నిజం జీవితంలోను కొన్ని రిస్క్ లు చేయక తప్పదు. అలా అని బయట అందరితో ఫైట్స్ చేయడం కాదు ఇక్కడ ఉద్దేశం. కేవలం వాళ్ళ కంఫర్ట్ జోన్ దాటి కథలను ఎంపిక చేసుకుని వారి 100% ఇస్తే సరిపోతుంది. అప్పుడు సినిమాకు ఆటోమాటిక్ గా హిట్ టాక్ వచ్చేస్తుంది.ఓ సినిమా మొదలైన దగ్గర నుంచి విడుదల అయ్యేంత వరకు మార్కెట్ అంత దాదాపు హీరో పేరు మీదే జరుగుతూ ఉంటుంది.అలాంటి హీరో రేంజ్ మారాలంటే..

హీరోలన్నాకా నిజం జీవితంలోను కొన్ని రిస్క్ లు చేయక తప్పదు. అలా అని బయట అందరితో ఫైట్స్ చేయడం కాదు ఇక్కడ ఉద్దేశం. కేవలం వాళ్ళ కంఫర్ట్ జోన్ దాటి కథలను ఎంపిక చేసుకుని వారి 100% ఇస్తే సరిపోతుంది. అప్పుడు సినిమాకు ఆటోమాటిక్ గా హిట్ టాక్ వచ్చేస్తుంది.ఓ సినిమా మొదలైన దగ్గర నుంచి విడుదల అయ్యేంత వరకు మార్కెట్ అంత దాదాపు హీరో పేరు మీదే జరుగుతూ ఉంటుంది.అలాంటి హీరో రేంజ్ మారాలంటే..

  • Published Sep 13, 2025 | 10:22 AMUpdated Sep 13, 2025 | 10:22 AM
కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన బెల్లంకొండ

కేవలం మూడు గంటల సినిమాలో కొన్ని యాక్షన్స్ సీన్స్ కోసం రిస్క్ చేయడం కాదు. హీరోలన్నాకా నిజం జీవితంలోను కొన్ని రిస్క్ లు చేయక తప్పదు. అలా అని బయట అందరితో ఫైట్స్ చేయడం కాదు ఇక్కడ ఉద్దేశం. కేవలం వాళ్ళ కంఫర్ట్ జోన్ దాటి కథలను ఎంపిక చేసుకుని వారి 100% ఇస్తే సరిపోతుంది. అప్పుడు సినిమాకు ఆటోమాటిక్ గా హిట్ టాక్ వచ్చేస్తుంది. ఓ సినిమా మొదలైన దగ్గర నుంచి విడుదల అయ్యేంత వరకు మార్కెట్ అంత దాదాపు హీరో పేరు మీదే జరుగుతూ ఉంటుంది.అలాంటి హీరో రేంజ్ మారాలంటే రిస్క్ లు తప్పవు. రకరకాల జోనర్స్ టచ్ చేయాల్సిందే. కేవలం నేను లవ్ స్టోరీస్ ఏ తీస్తాను , యాక్షన్ ఫిలిమ్స్ ఏ తీస్తాను అంటే కుదరదు.

ప్రేక్షకులు కూడా వారి అభిమాన హీరోల నుంచి కొత్తదనం కోరుకుంటారు. ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసింది కూడా ఇదే. ఇప్పటివరకు తన కెరీర్ లో టచ్ చేయని హర్రర్ జోనర్ ను టచ్ చేశాడు. తన కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చాడు. రొటీన్ సినిమాలకు దూరంగా వెళ్తూ తన మార్కెట్ సెల్ఫ్ స్టెబిలిటీ , మార్కెట్ ఎబిలిటీని పెంచుకుంటున్నాడు శ్రీనివాస్. నిజానికి మొన్నీమధ్యన వచ్చిన భైరవంతోనే తన కంఫర్ట్ జోన్ దాటి వచ్చాడు కానీ.. కమర్షియల్ పరంగా మూవీ అంత సక్సెస్ అందుకోలేదు. అయితే అందులో శ్రీనివాస్ పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

ఇక ఇప్పుడు కిష్కింధపురిలోను ఇతనికి మంచి మార్కులే పడుతున్నాయి. మాములుగా ఓ స్టాండర్డ్ లో ఉన్న హీరోలు హర్రర్ జోనర్లు ట్రై చేయరు. రజినీకాంత్ లాంటి స్టార్ హీరో చంద్రముఖి సినిమాలతో ఆ చైన్ బ్రేక్ చేసినప్పటికీ.. మిగిలినవాళ్లు దైర్యం చేయలేకపోయారు. వెంకటేష్ నాగవల్లి , నాగార్జున రాజుగారి గది లాంటి సినిమాలు ట్రై చేశారు కానీ మరీ అంత హైప్ అవ్వలేదు ఆ సినిమాలు. అక్కడ కంటెంట్ ను సరిగ్గా వాడుకోకపోవడమే రీజన్ అని అప్పట్లో టాక్ వచ్చింది. అయితే అసలు కథను కథనాన్ని.. దానికి సింక్ అయ్యేలా ఎలివేషన్స్ ను సరిగ్గా వాడుకుంటే హర్రర్ స్టోరీలు కాసుల వర్షం కురిపిస్తాయి.

అందుకే శ్రీనివాస్ ఇప్పుడు మార్కెట్ లెక్కలు , ఇమేజ్ వగైరా వగైరాలు చూడకుండా హర్రర్ స్టోరీకి ఎస్ చెప్పి.. ఇప్పుడు కిష్కింధపురితో హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ హీరో నుంచి వచ్చే నెక్స్ట్ లైన్ అప్స్ కూడా డిఫరెంట్ గానే ఉండబోతున్నాయని టాక్. రొటీన్ ఫార్ములాస్ కు దూరంగా వెళ్తున్న శ్రీనివాస్ కు.. ఇన్స్ టాంట్ రిజల్ట్స్ రావొచ్చు రాకపోవచ్చు. కానీ లాంగ్ రన్ లో మాత్రం మంచి సక్సెస్ అందుకోవడం ఖాయం. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం ఎలా చూసుకున్న ప్లస్ పాయింట్ లానే ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురి మూవీ రివ్యూ