iDreamPost
android-app
ios-app

Bellamkonda Sai Sreenivas: ‘మా ఊరి పొలిమేర’ డైరెక్టర్ తో బెల్లంకొండ! ప్లానింగ్ మామూలుగా లేదు..

  • Published Aug 01, 2024 | 1:01 PM Updated Updated Aug 01, 2024 | 1:01 PM

'మా ఊరి పొలిమేర' చిత్రంతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్. తాజాగా జాక్ పాట్ కొట్టేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు టైటిల్ కూడా పెట్టేసినట్లు సమాచారం.

'మా ఊరి పొలిమేర' చిత్రంతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్. తాజాగా జాక్ పాట్ కొట్టేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు టైటిల్ కూడా పెట్టేసినట్లు సమాచారం.

  • Published Aug 01, 2024 | 1:01 PMUpdated Aug 01, 2024 | 1:01 PM
Bellamkonda Sai Sreenivas: ‘మా ఊరి పొలిమేర’ డైరెక్టర్ తో బెల్లంకొండ! ప్లానింగ్ మామూలుగా లేదు..

బెల్లంకొండ శ్రీనివాస్.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ.. ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ‘టైసన్ నాయుడు’, ‘కిష్కింధపురి’, లూధీర్ బైరెడ్డి అనే దర్శకుడితో ‘హైంధవ'(వర్కింగ్ టైటిల్) అనే సినిమాలు చేస్తున్నాడు. తాజాగా మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఈ యంగ్ హీరో. ‘మా ఊరి పొలిమేర’ చిత్రంతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్. ఇతడి దర్శకత్వంలోనే బెల్లంకొండ శ్రీనివాస్ ఓ చిత్రం చేయబోతున్నాడు. ఆ మూవీకి పేరుకూడా పెట్టేశారు.

డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్.. ‘మా ఊరి పొలిమేర’  మూవీతో ఒక్కసారిగా పరిశ్రమలో సంచలనం రేపాడు. రెండు భాగాలుగా విడుదలైన ఈ మూవీ పార్ట్ 1 డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. అక్కడ ఊహించని విజయం సాధించడంతో.. పార్ట్ 2 ను థియేటర్లలో విడుదల చేశారు. ఇక్కడ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఈ మూవీ. ఇక ఈ ఫ్రాంచైజీ నుంచి పొలిమేర 3 కూడా వస్తున్నట్లు మేకర్స్ ఇటీవలే ఓ వీడియోను రిలీజ్ చేశారు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. పొలిమేర డైరెక్టర్ జాక్ పాట్ కొట్టేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ మూవీ చేయబోతున్నాడు ఈ అనిల్. శ్రీనివాస్ చిట్టూరి ఈ మూవీని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ కూడా లాక్ చేశారు.

ఇక ఈ చిత్రానికి ‘ఆట మెుదలైంది’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ మూవీలో యాక్షన్ తో పాటుగా సోషియో ఫాంటసీ అంశాలు పుష్కలంగా ఉన్నాయని టాక్. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనిల్ పొలిమేర 3ని కంప్లీట్ చేసి బెల్లంకొండ మూవీని స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ తో పాటుగా అనిల్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడా? లేక అవి పూర్తి అయ్యాకే ఈ మూవీ స్టార్ట్ చేస్తాడా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా.. బెల్లంకొండ ప్లానింగ్స్ మామూలుగా లేవు అంటూ సినీ పండితులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పక్కా ప్లానింగ్ తో ఈ కుర్ర హీరో దూసుకెళ్తున్నాడు అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. మరి వరుస సినిమాలతో దూసుకెళ్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş