iDreamPost
android-app
ios-app

Keerthy Suresh: ఆ హీరోతో కలిసి వర్క్ చేయాలన్నది నా కోరిక: కీర్తి సురేశ్

  • Published Aug 01, 2024 | 11:00 AM Updated Updated Aug 01, 2024 | 11:00 AM

ఆ స్టార్ హీరోతో కలిసి నటించాలన్నది తన కోరిక అని హీరోయిన్ కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రఘు తాత మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలో ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి కీర్తి వర్క్ చేయాలనుకుంటున్న ఆ హీరో ఎవరు?

ఆ స్టార్ హీరోతో కలిసి నటించాలన్నది తన కోరిక అని హీరోయిన్ కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రఘు తాత మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలో ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి కీర్తి వర్క్ చేయాలనుకుంటున్న ఆ హీరో ఎవరు?

  • Published Aug 01, 2024 | 11:00 AMUpdated Aug 01, 2024 | 11:00 AM
Keerthy Suresh: ఆ హీరోతో కలిసి వర్క్ చేయాలన్నది నా కోరిక: కీర్తి సురేశ్

సాధారణ వ్యక్తులకే కాదు.. సినిమా సెలబ్రిటీలకు కూడా కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయి. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలతో కలిసి పనిచేసినప్పటికీ.. పలానా హీరోతో కలిసి వర్క్ చేయాలని ఉన్నట్లు చాలా మంది హీరోయిన్లు తమ మనసులో కోరికను సందర్బానుసారంగా బయటపెడుతూ ఉంటారు. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా తన కోరికను బయటపెట్టింది. ఆ స్టార్ హీరోతో కలిసి వర్క్ చేయాలనుందని చెప్పుకొచ్చింది. మరి ఆ హీరో ఎవరు?

కీర్తి సురేశ్.. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం సుమన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రఘు తాత’ మూవీలో లీడ్ రోల్ చేస్తోంది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ లో కీర్తి కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆగస్ట్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బేబీ జాన్ అనే మరో మూవీలో కూడా ఆమె నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే రఘు తాత ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఈ బ్యూటీ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

కీర్తి  సురేశ్ మాట్లాడుతూ..”కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో కలిసి వర్క్ చేయాలన్నది నా కోరిక. ఒక్క సినిమాలో అయినా అతనితో కలిసి నటించాలనుంది. అతనంటే నాకు చాలా ఇష్టం. శింబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఒకటి, రెండు సార్లు ఫోన్లో కూడా మాట్లాడాను. తనతో కలిసి వర్క్ చేసే సమయం కోసం వేచిచూస్తున్నాను” అంటూ ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇక ఈ కామెంట్స్ తో అటు శింబు ఫ్యాన్స్ ఇటు కీర్తి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక శింబు చివరి సారిగా ‘పాతుథల’ మూవీలో కనిపించాడు. ప్రస్తుతం మణిరత్నం-కమల్ హాసన్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీపై అందరిలో క్యూరియాసిటీ హై రేంజ్ లో ఉంది. మరి శింబుతో కలిసి నటించాలనుందన్న కీర్తి సురేశ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom