iDreamPost
android-app
ios-app

Benefit Show Prices : ఒక్క టికెట్ కేవలం 5 వేలే

  • Published Mar 21, 2022 | 6:30 PM Updated Updated Mar 21, 2022 | 6:30 PM
Benefit Show Prices : ఒక్క టికెట్ కేవలం 5 వేలే

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ బెనిఫిట్ షో టికెట్ల కోసం విపరీతమైన ఒత్తిడి తలెత్తుతోంది. హైదరాబాద్ లో అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత ఏ క్షణమైనా మొదటి ఆట వేసేందుకు థియేటర్లు రెడీ అవుతున్నాయి. ఒక్క టికెట్ ధర 5 వేల రూపాయలుగా ఉందని అభిమానుల నుంచి అందుతున్న సమాచారం. ఇది చాలా ఎక్కువ. భీమ్లా నాయక్, రాధే శ్యామ్ లు 2 వేల దాకా అమ్ముడుపోయాయి. కాస్ట్ మరీ ఎక్కువ కావడంతో కొన్ని స్క్రీన్లలో సీట్లు మిగిలాయి. కానీ ఆర్ఆర్ఆర్ కు ఆ పరిస్థితి వచ్చేది అనుమానమే. ఎందుకంటే అయిదు వేలైనా సరే కొనాలని ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు. ఆ రేట్ కు హౌస్ ఫుల్స్ అయితే మాత్రం రికార్డే.

జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానుల నాలుగేళ్ల నిరీక్షణ కావడంతో ఆ గ్యాప్ ముందు ఈ ధరను వాళ్ళు లెక్కచేయడం లేదు. ప్రస్తుతానికి ఇదంతా అఫీషియల్ గా జరుగుతున్న వ్యవహారం కాదు. సోషల్ మీడియాను వేదికగా మార్చుకుని అమ్మే కార్యక్రమం పెట్టారు. ఫాన్స్ అసోసియేషన్ ద్వారా జరుగుతున్న తతంగం వేరే ఉంది. ఈ బెనిఫిట్ షోల సంగతి పక్కనపెడితే అన్ని సింగల్ స్క్రీన్లలోనూ 6 నుంచి షోలు స్టార్ట్ కాబోతున్నాయి. ఆన్ లైన్ లో టికెట్లు పెట్టారు కానీ దాదాపు ఎక్కడా దొరకని పరిస్థితి నెలకొంది. యాజమాన్యాలే బ్లాక్ చేసి అధిక ధరలలో బయట మార్గాల్లో ఇచ్చేస్తున్నారన్న కామెంట్స్ ఉన్నాయి కానీ హైప్ ముందు ఇవేవి హైలైట్ కావడం లేదు.

ఏపిలో కొంత మెరుగ్గా ఉంది. మరీ నాలుగైదు వేలు కాదు కానీ వెయ్యి నుంచి పదిహేను వందల మధ్య ధరలు ఉన్నాయట. కానీ షో టైం ఎప్పుడు ఉండొచ్చన్న క్లారిటీ ఇంకా రాలేదు. మొత్తానికి మొదటి వీకెండ్ టోటల్ గా హౌస్ ఫుల్ అయ్యే దిశగా బుక్ మై షో, పేటిఎం, టికెట్ న్యూ లాంటి యాప్స్ బిజీ బిజీగా ఉన్నాయి. కనీసం ఈ వేడి ఓ పది రోజుల పాటు ఉంటే కొండలా ఉన్న బ్రేక్ ఈవెన్ అందుకోవడం ఈజీ అవుతుంది. అన్నిటిని మించి బ్లాక్ బస్టర్ టాక్ రావడం చాలా అవసరం. యావరేజ్ అనిపించుకున్నా పెట్టుబడి రిస్క్ లో పడుతుంది. కానీ రాజమౌళి, ఇద్దరు హీరోల కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఆ ఇబ్బంది వచ్చేలా కనిపించడం లేదు

Also Read : Krithi Shetty : నాని రీమేకుల మీద షాహిద్ కన్ను