iDreamPost
android-app
ios-app

ప్రశాంత్ వర్మ భారీ ప్లానింగ్.. మోక్షజ్ఞతో బాలకృష్ణ!

  • Published Oct 25, 2024 | 4:57 PM Updated Updated Oct 25, 2024 | 5:04 PM

నందమూరి బాలకృష్ణ వారసుడిని ఎప్పుడెప్పడు తెరపై చూద్దామా అని అంతా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ బాధ్యతను చేపట్టింది యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

నందమూరి బాలకృష్ణ వారసుడిని ఎప్పుడెప్పడు తెరపై చూద్దామా అని అంతా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ బాధ్యతను చేపట్టింది యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది. అదేంటో చూసేద్దాం.

  • Published Oct 25, 2024 | 4:57 PMUpdated Oct 25, 2024 | 5:04 PM
ప్రశాంత్ వర్మ భారీ ప్లానింగ్.. మోక్షజ్ఞతో బాలకృష్ణ!

నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ వెండి తెరపై లాంచ్ అయ్యే సమయం దగ్గర పడుతుంది. ఈ బాధ్యతను ప్రశాంత్ వర్మ చేపట్టిన సంగతి తెలిసిందే. ఓ పక్క టాలెంటెడ్ డైరెక్టర్ మరో పక్క నందమూరి యంగ్ హీరో. వీరిద్దరి కాంబినేషన్ అనౌన్స్ చేసిన తర్వాత.. అందరికి సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఇంకా సినిమా పేరు తెలియదు .. కథ ఎలా ఉంటుందో తెలియదు.. క్యాస్టింగ్ ఎవరో తెలియదు. అయినా సరే సినిమాపై మాత్రం కాస్త హైప్ బాగానే ఉంది. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రశాంత్ వర్మ చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడిప్పుడే ఈ సినిమా నుంచి ఒక్కో అప్డేట్ వస్తుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ముగిశాయని.. దాదాపు డిసెంబర్ 2న క్లాప్ కొట్టి సినిమా పట్టాలెక్కించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమాను స్టార్ట్ చేసి రెగ్యులర్ షూట్ కు వెళ్లేందుకు ప్రశాంత్ వర్మ షెడ్యూల్ రెడీ చేస్తున్నాడంట.

ఇక ఇప్పుడు వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ న్యూస్ విషయానికొస్తే.. ఈ సినిమాలో మోక్షజ్ఞకు జోడిగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రషా తథానిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. రీసెంట్ గా ఆమె ఆడిషన్స్ కు అటెండ్ కాగా.. దర్శకుడు ఆమెను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు  కన్ఫర్మ్ అయింది. ఇద్దరూ తెలుగు తెరకు కొత్తే.. మరి ఆడియన్స్ వీరిని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఒకవేళ కథలో కంటెంట్ బావుంటే కనుక. తెలుగు ఆడియన్స్ ఏ రేంజ్ లో సపోర్ట్ చేస్తారో తెలియనిది కాదు. సో ఏమౌతుందో చూడాలి. పైగా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో బాలయ్య కూడా నటించబోతున్నారట. ఇది విన్న నందమూరి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎప్పుడెప్పుడు వీరిద్దరిని తెరపై చూద్దామా అని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయ్యిదంటే.. వరుస అప్డేట్స్ ను రివీల్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక అప్డేట్ వస్తే కానీ అసలు సినిమా కథేంటి అనే విషయం తెలియదు. ఇవన్నీ తెలియాలంటే అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే మరి.

ఇక ప్రశాంత్ వర్మ పని తనం గురించి తెలియనిది కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో హనుమాన్ తీసి.. ప్రభంజనం సృష్టించాడు. అలాంటిది ఇప్పుడు మోక్షజ్ఞ ప్రాజెక్ట్ అంటే.. ఇంకెంత కేర్ తీసుకుంటాడో అందరూ గెస్ చేయొచ్చు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. ఆల్రెడీ హనుమాన్ సిక్వెల్ జై హనుమాన్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వినిపిస్తున్న లిస్ట్ భారీగానే ఉంది. మొన్నీమధ్యన ఈ లిస్ట్ లో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు కూడా వినిపించింది. ఇక వీటి నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş