iDreamPost
android-app
ios-app

శ్రీదేవిని ఆ సినిమాలో నుండి తీసేయమని చెప్పా! బాలకృష్ణ సంచలన కామెంట్స్!

  • Published Sep 02, 2024 | 5:04 PM Updated Updated Sep 02, 2024 | 5:04 PM

Balakrishna comments on Sridevi: బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సంధర్భంలో.. తాజాగా దానికి సంబంధించిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ క్రమంలో బాలకృష్ణ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో తాజాగా శ్రీదేవి గురించి చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరికి ఇంట్రెస్టింగ్ గా మారాయి.

Balakrishna comments on Sridevi: బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సంధర్భంలో.. తాజాగా దానికి సంబంధించిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ క్రమంలో బాలకృష్ణ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో తాజాగా శ్రీదేవి గురించి చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరికి ఇంట్రెస్టింగ్ గా మారాయి.

  • Published Sep 02, 2024 | 5:04 PMUpdated Sep 02, 2024 | 5:04 PM
శ్రీదేవిని ఆ సినిమాలో నుండి తీసేయమని చెప్పా! బాలకృష్ణ సంచలన కామెంట్స్!

నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు చెప్తేనే అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతూ ఉంటారు. తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణకు , బాలకృష్ణ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఇక అది ఏ హీరో సినిమా అయినా..ఏ ఈవెంట్ అయినా యూత్ అంతా జై బాలయ్య అంటూ హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 వసంతాలు పూర్తైన సంధర్బంగా.. స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక వాటితో పాటు.. బాలయ్యకు సంబంధించిన కొన్ని ఇంటర్వ్యూలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ శ్రీదేవి గురించి చెప్పిన వ్యాఖ్యలు అందరికి ఇంట్రెస్టింగ్ గా మారాయి.

బాలకృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టి యాభై సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఇప్పటికే ఆయన దాదాపు ఇండస్ట్రీ లో ఉండే హీరోయిన్స్ అందరితో కలిసి నటించారని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ అప్పటి మోస్ట్ ఫేమస్ హీరోయిన్ శ్రీదేవి, బాలకృష్ణ కాంబినేషన్ లో మాత్రం ఒక్క మూవీ కూడా లేదు. రీసెంట్ గా ఇంటర్వ్యూలో దీనికి సంబంధించి…శ్రీదేవితో కలిసి సినిమాలు తీయకపోడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా లేదా.. యాదృచ్ఛికంగా అలా జరిగిందా అని అడుగగా.. బాలయ్య ఇలా సమాధానం ఇచ్చారు. “ఒక సినిమా తీసేటప్పుడు ఆర్టిస్ట్ సెలక్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్.. కథ కు ముందు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత కథలో ఆ పాత్రకు ఎవరు సూట్ అవుతారనే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాను. కొన్ని రీమేక్ లాంటి సినిమాలలో శ్రీదేవిని తీయమని చెప్పడం కూడా జరిగింది. ఆవిడ అందంగా ఉండదని కాదు.. చేయదు అని కాదు కానీ.. ఆ పాత్రకు ఆమె అవసరమా అనే ఉద్దేశంలో అలా చెప్పాల్సి వచ్చేది. మా కాంబినేషన్ సెట్ కాదని అనిపించేది.” అంటూ చెప్పుకొచ్చారు బాలకృష్ణ.

అయితే శ్రీదేవి మాత్రమే కాకుండా.. బాలకృష్ణ తన సినిమాలకు సంబంధించిన క్యాస్టింగ్ విషయంలో.. ఆ పాత్రకు సెట్ కానీ వాళ్ళని వద్దని డైరెక్టర్స్ తోనే చెప్పేవాళ్లట. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు.. బాలకృష్ణ తన సినిమాల కథల ఎంపికతో పాటు.. తనతో కలిసి నటించే నటి నటుల విషయంలో కూడా ఎంత కచ్చితంగా ఉంటారో. ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు పోటీగా తనదైన శైలిలో బాలకృష్ణ సినిమాలు తీస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో బాలకృష్ణ నుంచి ఇంకా ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingjojobetjojobet girişjojobet girişjojobet girişcasibom