సాధారణంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో హీరోలు, హీరోయిన్స్ కొన్ని కొన్ని కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఈ కామెంట్స్ వివాదాలకు, విమర్శలకు దారి తీస్తుంటాయి. ఇక మరికొన్ని కామెంట్స్ సరదాగా ఉంటాయి. కాగా.. ఇలాంటి కామెంట్సే చేశారు నందమూరి నటసింహం బాలకృష్ణ. తాజాగా జగపతిబాబు, మమతా మోహన్ దాస్, విమలారామన్, ఆశిష్ గాంధీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన’రుద్రంగి’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు బాలయ్య. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుమకు చెంప దెబ్బలు పడాలి అంటూ బాలయ్య అన్నారు.
రుద్రంగి.. ఫ్యామిలీ హీరో జగపతిబాబు, మమతా మోహన్ దాస్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం. ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా యూనిట్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించింది. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై.. తనదైన స్పీచ్ తో అదరగొట్టాడు. ఇక సుమ ఎప్పటిలాగే తన మార్క్ యాంకరింగ్ తో ఆకట్టుకోగా.. బాలయ్య రాగానే అందరు స్లోగన్స్ తో ఆడిటోరియం మెుత్తం దద్దరిల్లింది. కోకో కోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ అంటూ అభిమానులు స్లోగన్ తో రెచ్చిపోయారు.
దాంతో బాలయ్య మైక్ అందుకుని..”నన్ను సెక్సీ అంటే ఇక్కడ ఉన్న సుమ ఫీల్ అవుతుంది. ఇక నేను వచ్చే ముందు.. సుమ చెప్పకుండానే చప్పట్లు కొట్టారు అని ఆమె అంది. అసలు సుమకు కొన్ని చెంప దెబ్బలు పడాలి. అయితే ఇక్కడ ఇంకో తిరకాసు ఉంది.. చెంప దెబ్బలు కొడితే.. ఆమె చెప్పు దెబ్బలు కొడుతుంది. పాపం రాజీవ్ ఎలా భరిస్తున్నాడో ఏమో” చమత్కారంగా సుమను ఏడిపించాడు. మధ్యలో జగపతిబాబు మైక్ తీసుకుని.. “సుమ.. నీకోసం బాలయ్య డేట్ కూడా మార్చుకున్నారు. సుమ 28వ తేది రాదు అంటే.. సరే అని ఆయన 29న డేట్ సర్దుబాటు చేసుకున్నారు” అంటూ చెప్పుకొచ్చారు. దాంతో సుమ బాలయ్యకు దండం పెట్టింది. ఇక సినిమా విషయానికి వస్తే.. రుద్రంగి మూవీని తెలంగాణ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ నిర్మించారు. ఈ సినిమాకు దర్శకుడిగా అజయ్ సామ్రాట్ వ్యవహరించాడు. కాగా.. ప్రస్తుతం బాలయ్య సరదాగ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.