iDreamPost
android-app
ios-app

ఓటీటీ రిలీజ్​ కోసం ‘బేబీ’ ప్రయోగం.. ఏకంగా ఆ సీన్లను కలిపేందుకు ప్లాన్!

  • Author singhj Published - 09:34 AM, Fri - 4 August 23
  • Author singhj Published - 09:34 AM, Fri - 4 August 23
ఓటీటీ రిలీజ్​ కోసం ‘బేబీ’ ప్రయోగం.. ఏకంగా ఆ సీన్లను కలిపేందుకు ప్లాన్!

సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైన చిన్న చిత్రాలు వస్తుంటాయి. ఎవరూ ఊహించని విధంగా అవి సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఊహలకు అందని రీతిలో సూపర్బ్ కలెక్షన్స్​తో బాక్సాఫీస్​ వద్ద దుమ్మురేపుతాయి. ఈ ఏడాది అలాంటి ఒక చిన్న చిత్రమే రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆ మూవీనే ‘బేబీ’. డబుల్ బ్లాక్​బస్టర్​గా నిలిచిన ఈ మూవీ వసూళ్ల పరంగా పలు రికార్డులను కూడా క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు దర్వకత్వం వహించిన సాయి రాజేష్ మేకింగ్​కు అందరూ ఫిదా అవుతున్నారు. ఇదో కల్ట్ మూవీ అని చాలా మంది యూత్ ఆడియెన్స్ అంటున్నారు.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్​ అశ్విన్​లు తమ అద్భుతమైన యాక్టింగ్​తో ఆడియెన్స్​ను రిపీటెడ్​గా థియేటర్లకు రప్పిస్తున్నారు. ఇప్పటికే రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ‘బేబీ’ చిత్రం.. రూ.100 కోట్ల క్లబ్బులో చేరే దిశగా పరుగులు పెడుతోంది. ఈ మూవీ రన్​ ఎలా ఉందంటే.. వసూళ్ల విషయంలో ఆనంద్ దేవరకొండ అన్న విజయ్ దేవరకొండ సినిమా ‘అర్జున్ రెడ్డి’ని కూడా బ్రేక్ చేసింది. మూడు వారాలైనా ‘బేబీ’ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. పవన్ కల్యాణ్ ‘బ్రో’ను కూడా ‘బేబీ’ అధిగమించి దూసుకెళ్తోంది. ‘బ్రో’ చిత్రానికి నాలుగో రోజు నుంచి వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఇది ‘బేబీ’కి బాగా కలిసొస్తోంది. వీకెండ్​లో ఈ సినిమా రన్ అవుతున్న చాలా చోట్ల హౌస్​ఫుల్స్​ పడుతుండటం విశేషం.

‘బేబీ’ మూవీ త్వరలో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఓటీటీ రిలీజ్ విషయంలో ఈ మూవీ మేకర్స్ కొత్త ప్రయోగం చేస్తున్నారు. 3 గంటల నిడివితో వచ్చిన ఈ సినిమాను ఓటీటీ ఆడియెన్స్​ ముందుకు మాత్రం 4 గంటల నిడివితో రిలీజ్ చేయనున్నారని టాక్. నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ కానున్న ‘బేబీ’ ఓటీటీ వెర్షన్​లో ఒక పాటతో పాటు మరికొన్ని సీన్లను చేర్చనున్నారట. వైష్ణవి చైతన్య, విరాజ్ మధ్య వచ్చే కొన్ని బోల్డ్ సీన్లను కలపనున్నట్లు సమాచారం. అలాగే ఆనంద్ దేవరకొండకు అతడి తల్లికి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఓటీటీ కోసం జతచేయనున్నట్లు వినికిడి. మరి.. కొత్త ప్రయోగాలతో సరికొత్తగా ఓటీటీలోకి వచ్చే ‘బేబీ’ని చూసేందుకు మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabet