‘బేబి’ మూవీ ఓటీటీ పార్ట్​నర్​ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..!

  • Author singhj Published - 07:25 PM, Fri - 14 July 23
  • Author singhj Published - 07:25 PM, Fri - 14 July 23
‘బేబి’ మూవీ ఓటీటీ పార్ట్​నర్​ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..!

ఫిలిం ఇండస్ట్రీలో సాధారణంగా చిన్న సినిమాలకు బజ్ తక్కువగా ఉంటుంది. వీటి గురించి ఆడియన్స్​లో ఆసక్తి పెరగాలంటే మేకర్స్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. టీజర్, ట్రైలర్స్​తో ఆకట్టుకోవడమే గాక ప్రమోషన్స్ కూడా వెరైటీగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు గానీ సినిమా మీద బజ్ రాదు. అయితే అష్టకష్టాలు పడి అనుకున్న బడ్జెట్​లో సినిమా తీయడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో ఇంకా ప్రమోషన్స్​కు ఖర్చు చేయడం అంటే ఎంత ఇబ్బందో చెప్పనక్కర్లేదు. పెద్ద సినిమాలకైతే పబ్లిసిటీ కోసం సెపరేట్​గా బడ్జెట్​ను కేటాయిస్తారు. కానీ చిన్న మూవీస్​కు మాత్రం అది సాధ్యం కాదు. అందుకే వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూ ఉన్న బడ్జెట్​లో మూవీని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుంటారు.

ఈమధ్య కాలంలో అలా మంచి బజ్ తెచ్చుకున్న చిన్న చిత్రంగా ‘బేబి’ని చెప్పొచ్చు. ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా..’ అనే ఒక్క పాట ఈ సినిమాపై అంచనాలను ఫుల్​గా పెంచేసింది. స్టార్ యాక్టర్స్, డైరెక్టర్, నిర్మాత లేకపోయినా ఈ సినిమా కోసం కొన్నాళ్లుగా అందరూ తెగ ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది ‘బేబి’. ఈ మూవీని చూసిన వాళ్లు బాగుందని అంటున్నారు. తెలిసిన లవ్​స్టోరీలాగే ఉన్నప్పటికీ, దాన్ని డైరెక్టర్ డీల్ చేసిన పద్ధతి, టేకింగ్, డైలాగ్స్, మ్యూజిక్ బాగున్నాయని మెచ్చుకుంటున్నారు. అలాంటి ‘బేబి’ మూవీ ఓటీటీ పార్ట్​నర్​ను ఫిక్స్ చేసుకుంది.

‘బేబి’ ఓటీటీ హక్కుల్ని ఆహా సంస్థ సొంతం చేసుకుంది. అయితే బిగ్​స్క్రీన్స్​లోకి వచ్చిన ఆరు వారాల తర్వాతే ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం జరిగిందని సమాచారం. ఆ లెక్కన ఆగస్టు నెల ఆఖరి వారంలో ఆహాలో ‘బేబి’ స్ట్రీమింగ్ కావొచ్చని టాక్. అయితే దీనిపై కొన్నాళ్లు ఆగితే క్లారిటీ వస్తుంది. ఇకపోతే, ‘బేబి’లో వైష్ణవి అనే బస్తీ అమ్మాయి పాత్రలో వైష్ణవి చైతన్య నటించారు. వైష్ణవిని ప్రేమించే ఆనంద్ క్యారెక్టర్​లో ఆనంద్ దేవరకొండ యాక్ట్ చేశారు. మరో ముఖ్య పాత్రను విరాజ్ అశ్విన్ పోషించారు. ఇందులో ఆనంద్ దేవరకొండ యాక్టింగ్​పై ప్రశంసలు వస్తున్నాయి. ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. మరి.. ‘బేబి’ మూవీని మీరు చూశారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments