iDreamPost
android-app
ios-app

OTT: ప్రియదర్శి క్రైమ్ థ్రిల్లర్ ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’, టోవినో థామస్ ‘నారదన్’ ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్!

  • Published Nov 28, 2024 | 11:01 AM Updated Updated Nov 28, 2024 | 11:01 AM

AHA: వెర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి క్రైమ్ థ్రిల్లర్ 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి', మలయాళం స్టార్ టోవినో థామస్ 'నారదన్' ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

AHA: వెర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి క్రైమ్ థ్రిల్లర్ 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి', మలయాళం స్టార్ టోవినో థామస్ 'నారదన్' ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

  • Published Nov 28, 2024 | 11:01 AMUpdated Nov 28, 2024 | 11:01 AM
OTT: ప్రియదర్శి క్రైమ్ థ్రిల్లర్ ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’, టోవినో థామస్ ‘నారదన్’ ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్!

టాలీవుడ్ లో మంచి టాలెంటెడ్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు  వెర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి.  ఇక  ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించిన తాజా సినిమా  ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాలో  నిరంజన అనూప్, మణికందన్ ఆర్. ఆచారి ఇతర కీలక పాత్రలు పోషించారు. నారాయణ చెన్నా దర్శకత్వం వహించారు. బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ మూవీలో ప్రియదర్శి క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులని కట్టిపడేసింది. తనదైన నేచురల్ పెర్ఫామెన్స్, కామిక్ టైమింగ్ తో కథని ఆద్యంతం ఆకట్టుకునేలా నడిపారు ప్రియదర్శి. ఇప్పుడీ సినిమా భవానీ మీడియా ద్వారా ఆహ ఓటీటీలో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

ఇక మలయాళం స్టార్ హీరో టోవినో థామస్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం నారదన్. అన్నా బెన్, షరాఫుద్దీన్, ఇంద్రన్స్, జాఫర్ ఇడుక్కి ఇతర కీలక పాత్రలు పోషించారు. నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రంలో న్యూస్ యాంకర్ చంద్రప్రకాష్ పాత్రలో టోవినో మెస్మరైజ్ చేశారు. నేటి TRP-బేస్డ్ మీడియా ల్యాండ్‌స్కేప్‌లో నైతిక జర్నలిజం పాత్రపై నారదన్ పవర్ ఫుల్ ప్రతిబింబం. నారదన్ జర్నలిస్టులు ఎదుర్కొనే సవాళ్లను, కథల కోసం కనికరంలేని అన్వేషణ, వారి అభిరుచి కోసం చాలా మంది భరించే సవాళ్లను ఎక్సయిటింగ్ ప్రజెంట్ చేస్తోంది.మలయాళంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ భావనీ మీడియా ద్వారా ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. నవంబర్ 29 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. ఈ రెండు ఎక్సయిటింగ్ మూవీస్ ని వీకెండ్ లో ఆహా లో మిస్ అవ్వొద్దు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş