iDreamPost
android-app
ios-app

‘బేబి’ మూవీని వదులుకున్న స్టార్ హీరోయిన్.. రిజల్ట్ చూసి కుళ్లుకోవాల్సిందే!

  • Author singhj Published - 09:03 PM, Fri - 14 July 23
  • Author singhj Published - 09:03 PM, Fri - 14 July 23
‘బేబి’ మూవీని వదులుకున్న స్టార్ హీరోయిన్.. రిజల్ట్ చూసి కుళ్లుకోవాల్సిందే!

ఫిలిం ఇండస్ట్రీలో అప్పుడప్పుడూ కొన్ని అద్భుతమైన చిన్న చిత్రాలు వస్తుంటాయి. ఇవి మ్యాజిక్ చేసి వెళ్లిపోతుంటాయి. ప్రేక్షకుల మనసులను దోచుకోవడంతో పాటు వారికి ఎప్పటికీ గుర్తుండిపోయే ఫీలింగ్​ను ఇస్తాయి. అలాంటి చిన్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇవి ఎప్పుడో అరుదుగా వస్తుంటాయి. వీటిని ఆడియెన్స్ కూడా నెత్తిన పెట్టుకుంటారు. తమకు నచ్చితే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలను ప్రేక్షకులు ఎప్పుడూ చూపించరు. దీన్ని ఎన్నో మూవీస్ నిరూపించాయి. ఇవాళ రిలీజైన ‘బేబి’ మూవీ అలాంటి కేటగిరీలోకి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, యూట్యూబ్ సెన్సేషన్ వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రమే ‘బేబి’.

‘కలర్ ఫొటో’తో నేషనల్ అవార్డు గెలుచుకున్న నిర్మాత సాయి రాజేష్ డైరెక్షన్​లో రూపొందిన ‘బేబి’కి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘ఓ రెండు మేఘాలిలా..’ అనే పాటతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లే మూవీ కూడా బాగుండటంతో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చిన్న చిత్రంగా రిలీజైన ‘బేబి’కి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు యూఎస్​లోనూ ఈ మూవీ అదరగొడుతోంది. ఇందులో ఆనంద్ దేవరకొండ నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. ‘బేబి’ మూవీ స్టోరీ తెలిసినదే అయినా దర్శకుడు డీల్ చేసిన విధానం, నటీనటుల నటన, మ్యూజిక్ అన్నీ బాగా కుదిరాయని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. కొందరు నెటిజన్స్ దీన్ని కల్ట్ మూవీ అని అంటున్నారు.

మంచి టాక్ తెచ్చుకున్న ఈ లవ్​ స్టోరీలో నటించే ఛాన్స్​ను యంగ్ హీరోయిన్ శ్రీలీల మిస్ చేసుకున్నారట. ప్రస్తుతం పలు పెద్ద ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీబిజీగా ఉండటంతో కనీసం కథ కూడా వినకుండా ఆమె నో చెప్పారని టాలీవుడ్ టాక్. ఈ జనరేషన్ హీరోయిన్ కాబట్టి ఆమె క్రేజ్ ‘బేబి’ మార్కెటింగ్​కు పనికొస్తుందని మేకర్స్ భావించారట. అయితే శ్రీలీల నో చెప్పడంతో యూట్యూబర్​ వైష్ణవి చైతన్యను హీరోయిన్​గా తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు శ్రీలీల కుళ్లుకోవాల్సిందేనని నెటిజన్స్ అంటున్నారు. మరి.. ‘బేబి’ మూవీని మీరు చూశారా? ఆ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.