iDreamPost
android-app
ios-app

సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన బేబీ హీరో కొత్త సినిమా

  • Published Feb 08, 2024 | 12:17 PM Updated Updated Mar 14, 2024 | 5:02 PM

టాలీవుడ్ యంగ్ హీరో విరాజ్ ఆశ్విన్ బేబి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన ప్రధాన పాత్రలో ఓ సినిమా నటించాడు. అది సైలెంట్ గా ఓటీటీలో సందడి చేస్తోంది. ఇంతకి ఆ సినిమా ఏదంటే..

టాలీవుడ్ యంగ్ హీరో విరాజ్ ఆశ్విన్ బేబి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన ప్రధాన పాత్రలో ఓ సినిమా నటించాడు. అది సైలెంట్ గా ఓటీటీలో సందడి చేస్తోంది. ఇంతకి ఆ సినిమా ఏదంటే..

  • Published Feb 08, 2024 | 12:17 PMUpdated Mar 14, 2024 | 5:02 PM
సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన బేబీ హీరో కొత్త సినిమా

టాలీవుడ్ లో మరో యంగ్ హీరో తన సత్తాను చాటుతూ వరుస సినిమాల్లో దూసుకుపోతున్నాడు. ఆయనే బేబీ హీరో ‘విరాజ్ అశ్విన్’. విరాజ్ ‘బేబి’ సినిమాలో తన ఆద్భుతమైన నటనతో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే ఈ సినిమాతో విరాజ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పేరిగింది. కాగా, ఇంతకు ముందు విరాజ్ చాలా సినిమాల్లో నటించిన అవి ఏవి విరాజ్ కు అంత పేరును తెచ్చిపెట్టలేదు. కానీ, బేబి సినిమాలో సెకండ్ హీరోగా నటించి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే.. విరాజ్ బేబి సినిమా తర్వాత ఓ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఆ సినిమా థీయేటర్లలో అంతగా అలరించకపోవడంతో.. తాజాగా ఓటీటీలో సందడి చేస్తోంది. ఇంతకి ఆ సినిమా ఏదంటే..

విరాజ్ ఆశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘జోరుగా హుషారుగా’. ఇది గతేడాది డిసెంబర్ 15న థీయేటర్లలో విడుదలైన సంగంతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అనుప్రసాద్ తెరకెక్కించారు. ఇందులో పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటించింది. ఇది ఒక మంచి లవ్ స్టోరీతో పాటు, తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని చూపించే ప్రయత్నం చేశారు. కానీ, ఇది అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా తాజాగా ఓటీటీలో ఎటువంటి ప్రకటన లేకుండా సడన్ గా ప్రత్యక్షమైంది. కాగా, జోరుగా హుషారుగా సినిమా అమెజాన్ ఫ్రైమ్ వీడియాలొ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఎటువంటి ప్రకటన లేకుండా ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడం పై ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

ఇక సినిమా కథ విషయానికి వస్తే.. హీరో సంతోష్ (విరాజ్ ఆశ్విన్) ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఇతడు తండ్రి సాయికుమార్ రూ.20 లక్షలు అప్పు తీర్చేందుకు తెగ కష్టపడతాడు. ఇక సంతోష్ బాస్ ఆనంద్ (మధు నందన్) కు 35 ఏళ్లొచ్చినా పెళ్లి కాలేదు. ఇంతతో హీరో ప్రేయసి నిత్య (పూజిత పొన్నాడ) చెప్పాపెట్టకుండా ఇతడి ఆఫీసులోనే జాయిన్ అవుతుంది. అయితే అనుకొని పరిస్థితుల్లో బాస్.. హీరోయిన్ ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది సంతోష్ అప్పు తీర్చాడా తన లవ్ స్టోరీ సాఫీగా ముందుకు వెళ్లిందా లేదా అని తేలియాలంటే ఓటీటీలో ఈ సినిమా చూడాల్సిందే. మరి, ఓటీటీలో సందడి చేస్తున్నా విరాజ్ జోరుగా హుషారుగా సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş