iDreamPost
android-app
ios-app

టాలీవుడ్‌లో మరో సాయిపల్లవి! అందంలో మాత్రమే కాదు!

  • Published Jan 20, 2024 | 4:26 PM Updated Updated Jan 20, 2024 | 4:26 PM

చీరల్లో ఉన్న అన్ని రకాల గురించి ఓ అమ్మాయి చెబుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఓ బ్యూటీ. గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతూ తన నటనతో కట్టిపడేస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో తెలుసా..?

చీరల్లో ఉన్న అన్ని రకాల గురించి ఓ అమ్మాయి చెబుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఓ బ్యూటీ. గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతూ తన నటనతో కట్టిపడేస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో తెలుసా..?

  • Published Jan 20, 2024 | 4:26 PMUpdated Jan 20, 2024 | 4:26 PM
టాలీవుడ్‌లో మరో సాయిపల్లవి! అందంలో మాత్రమే కాదు!

‘మనం ఎలాంటి చీరలు అమ్ముతామంటే..సింథటిక్, క్రేప్ సిల్క్, ఉప్పాడ, కుప్పడం, బెనారస్, ఫ్యాన్సీ,షిఫాన్, జార్జెట్, ఆర్గంజా, పోచంపల్లి, గద్వాల్, వెంటకగిరి, మంగళగిరి, ధర్మవరం, పోలవరం’ అంటూ గుక్క తిప్పుకోకుండా.. ఎన్ని రకాల చీరలు ఉన్నాయో చెబుతూ ట్రెండ్ అవుతోంది ఓ బ్యూటీ. కన్యా కుమారి సినిమాలోని లెంత్తీ డైలాగ్ అది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా.. తన నటనతో ఆకట్టుకుంటోంది. ఉత్తరాంధ్ర భాషలో డైలాగ్స్ అదరగొట్టింది. గడుసు పిల్లగా, ఇండిపెండెంట్ ఉమెన్‌గా కనిపిస్తూ అలరిస్తుంది. పెళ్లి చూపులు సన్నివేశంలో పెళ్లి కొడుకు ఏదైనా అడగండి అనగానే.. మొహమాటం పడకుండా ‘మీది విగ్గుకదా’ అంటూ ఫక్కున నవ్వుతుంది.

ఈ సినిమా ట్రైలర్ విజయ్ దేవర కొండ విడుదల చేయడం విశేషం. ఆసాంతం తన నటనతో ఆకట్టుకున్న ఆ బ్యూటీ పేరు గీత్ షైనీ.  ఈ ట్రైలర్ చూస్తుంటే.. కచ్చితంగా కన్యా కుమారి సినిమాలో మంచి రోల్ ప్లే చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇదే ఆమెకు తొలి సినిమా కాదూ. కానీ గీతా షైనీ అంతక ముందు ఆనంద్ దేవరకొండ మూవీ పుష్పక విమానంలో నటించింది. అందులో ఆనంద్ భార్యగా మీనాక్షి పాత్రలో కాసేపు కనిపిస్తోంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇంట్లో నుండి వెళ్లిపోతుంది. అనంతరం అతడి ఇంట్లోనే శవమై కనిపిస్తుంది. కనిపించేది కాసేపు అయినా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తన రెండవ సినిమాతో వస్తోంది.

ఇందులో కళ్యాణం, కమనీయం సాంగ్ ఆనంద్, గీత్ సైని మధ్యే తెరకెక్కించారు. ఇటీవల కాలంలో ప్రతి పెళ్లిలో ఈ పాట వినిపిస్తూనే ఉంది. ఆమెకు డ్యాన్సులు అంటే విపరీతమైన ఇష్టం. ఆమె డ్యాన్సర్ కూడా. సాయి పల్లవిలా యాక్ట చేయాలని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పడు ఆమెలాగే ఆచి తూచి సినిమాలు చేస్తోంది. రెండేళ్ల క్రితం పుష్పక విమానం సినిమాలో కనిపించి.. ఇప్పుడు కన్యాకుమారి సినిమాతో రాబోతుంది. ఇందులో కూడా తనదైన సింపుల్ యాక్టింగ్ తో ఇరగదీస్తుంది. ఈ సినిమా హిట్ అయితే.. టాలీవుడ్ కు మరో సాయి పల్లవి లభించినట్లే లెక్క.   చూజీగా సినిమాలు చేస్తే.. పక్కాగా తెలుగు పరిశ్రమకు మంచి హీరోయిన్ దొరికినట్లే.

ప్రస్తుతం తన చీరల డైలాగ్‌తో ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమాతో ఓ మంచి క్యారెక్టర్ దక్కినట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు వస్తే.. శ్రీచరణ్ హీరోగా నటిస్తున్నారు. రాడికల్ పిక్చర్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. పుష్పక విమానాన్ని తెరకెక్కించిన దామెదర కన్యాకుమారి చిత్రానికి కూడా డైరెక్టర్. ఈ పిక్చర్‌లో కన్యాకుమారి పాత్రలో కనిపించబోతోంది ఈ బ్యూటీ. మరీ ఆ చీరల వీడియో చూశారా.. చూడకపోతే.. చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Geeth Saini (@geeth.saini)


Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss