iDreamPost
android-app
ios-app

10 కోట్లు ఇచ్చినా డేట్స్ కష్టమే! స్టార్ హీరోల రేంజ్ కు అనిరుధ్!

  • Author ajaykrishna Published - 03:07 PM, Wed - 16 August 23
  • Author ajaykrishna Published - 03:07 PM, Wed - 16 August 23
10 కోట్లు ఇచ్చినా డేట్స్ కష్టమే! స్టార్ హీరోల రేంజ్ కు అనిరుధ్!

ప్రస్తుతం ఇండియా వైడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో అనిరుధ్ రవిచందర్ ఒకరు. కొన్నాళ్ళ క్రితం లవ్ సాంగ్స్ లో దిట్ట అనిపించుకున్న ఈ రాక్ స్టార్.. ఇప్పుడు అల్టిమేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు. ఈ మధ్యకాలంలో అనిరుధ్ వర్క్ చేసిన ఏ ఆల్బమ్ చూసినా.. సాంగ్స్ లో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో నెక్స్ట్ లెవెల్ కసి కనిపిస్తుంది. ఒకదాని తర్వాత ఇంకోటి.. దాని వెనకే మరోటి.. అన్నట్లుగా అనిరుధ్ హవా సాగుతోంది. సౌత్ మ్యూజిక్ నార్త్ జనాలకు కూడా ఫుల్లుగా ఎక్కుతోంది అంటే.. అనిరుధ్ లాంటి మాస్ పల్స్ తెలిసిన వారే కారణం. ప్రెజెంట్ ఇండస్ట్రీలో జైలర్ ఊపు నడుస్తోంది.

మాస్, క్లాస్ సాంగ్స్ తో తెరపై సూపర్ స్టార్ రజినీ స్టైల్ ని ఊహించని విధంగా ఎలివేట్ చేశాడు అనిరుధ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఏ సినిమాలోనైనా ఎమోషనల్, రొమాంటిక్, కామెడీ, లవ్.. ఇలా ప్రతీ ఎమోషన్ ని తన మ్యూజిక్ తో ఎలివేట్ చేసే విధానం థియేటర్స్ లో విజిల్స్ వేయిస్తోంది. వెరసి.. అనిరుధ్ కి ఇండస్ట్రీలో అన్ని భాషల నుండి డిమాండ్ పీక్స్ కి చేరుకుంది. ఫలానా ప్రాజెక్ట్ లో అనిరుధ్ ఉన్నాడని తెలిస్తే చాలు.. బడా నిర్మాతలు అందరూ వరుసగా క్యూ కడుతున్నారు. వెనకాముందు అయినా అనిరుధ్ మాత్రమే కావాలి అనే రేంజ్ కి క్రేజ్ చేరుకుంది.

అనిరుధ్ అంటేనే బ్లాక్ బస్టర్ ఆల్బమ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనే విధంగా ముద్ర వేసుకున్నాడు ఈ రాక్ స్టార్. అయితే.. అనిరుధ్ రెమ్యూనరేషన్ టాక్ కూడా బ్లాక్ బస్టర్ అన్నట్లుగానే వినిపిస్తుంది. ప్రస్తుతం అనిరుధ్ ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడో అధికారికంగా తెలియదు. కానీ.. సుమారు రూ. 10 కోట్లు తీసుకుంటున్నాడని కోలీవుడ్ వర్గాల టాక్. సరే ఎంతైనా ఇద్దాం మనకు హిట్టు ముఖ్యం అనుకుంటే.. అనిరుధ్ డేట్స్ ఖాళీ ఉండట్లేదట. తెలుగులో ఇప్పటిదాకా విక్రమ్, జైలర్ రేంజ్ మ్యూజిక్ కొట్టించుకున్న సినిమాలు రాలేదు. తమిళంలో డాక్టర్, బీస్ట్, మాస్టర్, విక్రమ్, దర్బార్, పేట, తిరు.. ఇలా చెప్పుకుంటూ పోతే అనిరుధ్ ప్రతీ ఆల్బమ్ సూపర్ హిట్. అవన్నీ కూడా సినిమాలు సక్సెస్ అవ్వడంలో హెల్ప్ అయినవే. అలాంటిది ఇప్పుడు.. స్టార్ హీరోల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కి ఎదిగాడు అనిరుధ్. ప్రస్తుతం ఇండియన్ 2, దేవర, విడముయర్చి, రజినీ170-171, టైసన్ లతో పాటు చాలా సినిమాలు లైనప్ చేశాడు. మరి తెలుగులో దేవరతో ఎన్టీఆర్ కి ఎలాంటి ఆల్బమ్ రెడీ చేస్తున్నాడో చూడాలి. మరి అనిరుధ్ మ్యూజిక్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss