అనిల్ రావిపూడి -వెంకటేశ్ మూవీ టైటిల్ ఇదేనా?

Anil Ravipudi,Venkatesh Movie Title: సంక్రాతి సీజన్ వస్తుందంటే.. తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణంతో పాటు.. కొత్త సినిమాల సందడి కూడా మొదలవుతుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుంచే పోటీ పడుతున్నారు స్టార్ హీరోలు.. ఆ వివరాలను చూసేద్దాం.

Anil Ravipudi,Venkatesh Movie Title: సంక్రాతి సీజన్ వస్తుందంటే.. తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణంతో పాటు.. కొత్త సినిమాల సందడి కూడా మొదలవుతుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుంచే పోటీ పడుతున్నారు స్టార్ హీరోలు.. ఆ వివరాలను చూసేద్దాం.

సంక్రాతి సీజన్ అంటే మూవీ లవర్స్ కు నిజంగా పండగే. ఎందుకంటే ఆ సమయంలో ప్రతి ఏటా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ ఏడాది సంక్రాతి రేస్ లో స్టార్ హీరోల సినిమాలతో పాటు.. చిన్న సినిమాగా హనుమాన్ రిలీజ్ అవ్వడం.. ఊహించని సక్సెస్ సాధించడం ఇవన్నీ అందరికి తెలిసిన విషయమే. ఇలా సంక్రాతికి రిలీజ్ అయ్యే సినిమాల మీద మంచి బజ్ క్రియేట్ అవుతూ ఉంటూ ఉంటుంది. దీనితో వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుంచే పోటీ పడుతున్నారు స్టార్ హీరోలు. మరి ఆ సినిమాలేంటో.. వచ్చే ఏడాది సంక్రాతికి రాబోయే సినిమాలేంటో చూసేద్దాం.

ఇప్పటికే చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా సంక్రాంతి బరిలో ముందుంది.జనవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్ . ఈ సినిమా కాకుండా.. బాలకృష్ణ నటింస్తున్న ఓ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ.. ఇంకా ఎవరు డేట్ లాక్ చేసుకోలేదు కాబట్టి బాలయ్య సినిమా కూడా ఈ రేస్ లో ఉండే అవకాశాలు లేక పోలేదు. ఇక ఆ తర్వాత అనిల్ రావిపూడి , విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో రాబోతున్న ఓ ఇంట్రెస్టింగ్ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

అనిల్ , వెంకటేష్ కాంబినేషన్ లో రాబోయే సినిమాకు ఈ టైటిల్ నేమ్ ఎప్పటినుంచో వినిపిస్తున్నా కూడా.. ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమా దిల్ రాజు బ్యానర్స్ పై తెరకెక్కబోతుంది. దిల్ రాజుకు సంక్రాంతి సమయం బాగానే కలిసి వస్తుంది . గతంలో కూడా ఈ సంక్రాంతికి ఈ బ్యానర్స్ పై వచ్చిన సినిమాలు భారీ సక్సెస్ ను అందుకున్నాయి. కాబట్టి.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు అధికంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ అయితే ఇదే.. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటనను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలు కాకుండా ఏవైనా చిన్న సినిమాలు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. మరి వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఎవరు పార్టిసిపేట్ చేయనున్నారో.. ఎవరు విన్నర్ గా నిలువనున్నారో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments