iDreamPost
android-app
ios-app

నన్ను వదిన అని పిలిచి.. జానీని బావ అని పిలుస్తూ.. : ఆయేషా

  • Published Sep 21, 2024 | 12:27 PM Updated Updated Sep 21, 2024 | 12:27 PM

Jani Master Wife Ayesha: అత్యాచార ఆరోపణలపై జానీ మాస్టర్ అరెస్టు అయ్యాడు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. ఇదిలా ఉంటే.. బాధితురాలి గురించి సంచలన విషయాలు వెల్లడించింది జానీ మాస్టర్ భార్య ఆయేషా.. ఆమె ఏమన్నదంటే.?

Jani Master Wife Ayesha: అత్యాచార ఆరోపణలపై జానీ మాస్టర్ అరెస్టు అయ్యాడు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. ఇదిలా ఉంటే.. బాధితురాలి గురించి సంచలన విషయాలు వెల్లడించింది జానీ మాస్టర్ భార్య ఆయేషా.. ఆమె ఏమన్నదంటే.?

  • Published Sep 21, 2024 | 12:27 PMUpdated Sep 21, 2024 | 12:27 PM
నన్ను వదిన అని పిలిచి.. జానీని బావ అని పిలుస్తూ.. : ఆయేషా

తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌ చేసిన ఆరోపణపై అరెస్టయ్యాడు టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. గోవాలో అరెస్టు చేసిన ఆయన్ను హైదరాబాద్ తరలించి… ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఆయనకు న్యాయ స్థానం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, కావాలనే ఈ కేసులో ఇరికించారని, ఎవరినీ వదిలిపెట్టనంటూ చెప్పాడు జానీ మాస్టర్. అలాగే ఈ కేసులో న్యాయ పోరాటం చేస్తామని ఆయన భార్య సుమలత అలియాస్ అయేషా తెలిపింది. ఇదిలా ఉంటే.. ఆయేషా కూడా తనపై దాడి చేసిదంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొనడంతో జానీ మాస్టర్ భార్యను కూడా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ కేసులో అనేక కోణాలు వెలుగు చూస్తున్నాయి.

ఇదిలా ఉంటే..ఈ కేసులో అరెస్టైన జానీ మాస్టర్ భార్య.. ఓ మీడియా ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించింది. తామే అసలు బాధితులమంటూ వాపోయింది. ‘తనే మా జీవితంలోకి బలవంతంగా ఎంటర్ అయ్యింది, ఆమె నన్ను వదిన అని పిలిచేది, అటు పక్కకు వెళ్లి జానీని బావ అని పిలిచేది. నువ్వుంటే ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నా అంటూ వెంటపడింది. ఈ విషయాన్ని జానీ నాకు చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయిని ఇంటికి పిలిచి.. ఈ ఏజ్ ఎట్రాక్ట్ అయ్యే ఏజ్.. నీ లైఫ్ చాలా ఉంది. రాంగ్ వేలో వెళుతున్నావ్. ఇది కరెక్ట్ కాదు అని చెప్పా. జానీ కూడా ఇదే చెప్పాడు. కానీ ఆమె వినిపించుకోలేదు. నువ్వు లేకపోతే నేను లేను. అలాగే చచ్చిపోతాను అంటూ బెదిరించేది. దీంతో ఎవరైనా ఏం చేస్తారు. చచ్చిపో అనరు కదా. ఇదంతా ఆమె, ఆమె ఫ్యామిలీ ఆడిన హనీ ట్రాప్’ అని పేర్కొంది.

అలాగే జానీ మాస్టర్ నుండి బంగారం కూడా కొనిపించుకుందని వెల్లడించింది ఆయేషా. ‘ఆ అమ్మాయికి క్యాష్, గోల్డ్ ఇచ్చారు. నాకు గిఫ్ట్‌లు కావాలంటూ జానీతో కొనిపించుకునేది. ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉందంటూ డబ్బులు తీసుకునేది. ఇదంతా నా దగ్గర ఫ్రూఫ్ ఉంది. ఈ నాటకం అంతా బాధితురాలి తల్లి వెనక ఉండి నడిపిస్తుంది. పేరు, డబ్బు ఉన్న వాళ్లను ఎరవేసి, కూతుర్ని అడ్డుపెట్టుకుని సంపాదిస్తుంది. నువ్వే ఏమైనా చేయ్.. మనం ఇక్కడ టాప్ పోజిషన్‪లోకి వెళ్లాలి. ఇదే ఆమె కాన్సెప్ట్. లేకుంటే ఇద్దరు బిడ్డలు ఉన్న ఏ మగాడి దగ్గరకు ఏ తల్లి పంపిస్తుంది. నాకు విషయం తెలిసి అమ్మాయి ఇంటికి వెళ్లి కొట్టాను’ అని తెలిపింది ఆయేషా.

‘అబద్దపు మాటలు చెప్పి మాస్టర్ దగ్గరకు ఎంటర్ అయ్యింది. ఇప్పుడు ఇలా రాంగ్ కేసులు పెట్టింది.  ఆమె వల్ల నేను డిప్రెషన్‌కు వెళ్లా.. సూసైట్ అంటప్ట్ చేశాను. నా పిల్లలకు దూరం చేసింది. నా దగ్గర ఒక మాట.. నా భర్త దగ్గర ఒక మాట చెప్పేది. నన్ను వదిన అని పిలిచేది. దీంతో నాకు అనుమానం రాలేదు. తర్వాత జానీ దగ్గరకు వెళ్లి మరోలా ప్రవర్తించేది. ఆమె డబుల్ గేమ్ ఆడుతుందని తెలిసి ఇంటికి వెళ్లి అడిగా. అప్పుడు కూడా నా భర్త దగ్గరకు వచ్చి మాట్లాడేది. సహించలేక చేయి చేసుకున్నా. అదే సమయంలో మా ఇద్దరి మధ్య ఏం లేదు అంటది. జానీతో నన్ను పెళ్లి చేసుకో అంటుంది. ఇప్పుడేమో 16 సంవత్సరాల నుండి కేస్ పెట్టింది’ అంటూ చెప్పుకొచ్చింది ఆయేషా.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet