iDreamPost
android-app
ios-app

విజయ్ దేవరకొండ తమ్ముడిపై అనసూయ కామెంట్! ట్వీట్ వైరల్!

  • Author ajaykrishna Published - 09:26 AM, Tue - 11 July 23
  • Author ajaykrishna Published - 09:26 AM, Tue - 11 July 23
విజయ్ దేవరకొండ తమ్ముడిపై అనసూయ కామెంట్! ట్వీట్ వైరల్!

టాలీవుడ్ గ్లామరస్ యాంకర్ అనసూయ.. సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో తెలిసిందే. తన అభిప్రాయం ఎలాంటిది అయినా ఏమాత్రం జంకకుండా సోషల్ మీడియాలో డైరెక్ట్ చెప్పేస్తుంది. ఎలాంటి విషయం మీదనైనా చర్చలకు దిగేందుకు సిద్ధంగా ఉంటుంది. అలాంటి అనసూయకు, హీరో విజయ్ దేవరకొండకు మధ్య వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనసూయ, విజయ్ ల గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు. అప్పట్లో అర్జున్ రెడ్డి మూవీలో తల్లిని కించపరుస్తూ చెప్పిన డైలాగ్ ని తప్పుబట్టింది అనసూయ. అప్పుడే హీరో విజయ్ పై కూడా సీరియస్ అయింది. అక్కడినుండి అనసూయ, విజయ్ ల మధ్య వాతావరణం వేడెక్కిపోయింది.

మా హీరోనే విమర్శిస్తావా అంటూ.. విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయను సోషల్ మీడియాలో చాలాసార్లు టార్గెట్ చేశారు. ఈ వివాదం పై డిబేట్స్ కూడా నడిపించారు. అయినా వాతావరణం ఇంకా అలాగే ఉంది. ఇలాంటి తరుణంలో అనసూయ నుండి అనూహ్యమైన మార్పు. తాను ఇలాంటి వివాదాలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టేయాలని భావిస్తున్నట్లు ఓపెన్ గా ప్రకటించేసింది. దీంతో అంతా సెట్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు కొత్తగా విజయ్ దేవరకొండ తమ్ముడు గురించి తాజాగా తాను పోస్ట్ చేసిన ట్వీట్ లో ప్రస్తావించింది అనసూయ. అలాగే బేబీ మూవీ ట్రైలర్ పై పాజిటివ్ కామెంట్స్ చేయడం విశేషం.

ప్రస్తుతం అనసూయ విజయ్ దేవరకొండ తమ్ముడి సినిమాపై పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడమే హాట్ టాపిక్ గా మారింది. ఆమె ట్వీట్ లో.. ‘పార్టీకి చాలా లేట్ అయ్యింది. ట్రైలర్ లో ఒరిజినాలిటీకి దగ్గరగా ఉన్న హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ నాకు చాలా నచ్చాయి. ఎందుకో నాకు తెలిసిన వాళ్ల కథలానే అనిపిస్తుంది. ఇంకా సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మీ వర్క్ చూసి గర్వంగా ఉంది డైరెక్టర్ గారు.’ అని తెలిపింది. అలాగే యాక్టర్స్ గురించి ప్రస్తావిస్తూ.. విరాజ్ కూల్ గా ఉన్నాడు. ఆనంద్ దేవరకొండ ఇంటెన్స్ బాగుంది. వైష్ణవి ప్రామిసింగ్ గా కనిపిస్తుంది అంటూ ప్రశంసించింది. ఆనంద్ గురించి అనసూయ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేసరికి విజయ్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరి అనసూయ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.