iDreamPost
android-app
ios-app

నన్ను విమర్శించిన స్వీకరిస్తా.. ఆమెను మాత్రం అవమానించొద్దు :అనసూయ

  • Published Jul 15, 2024 | 6:12 PM Updated Updated Jul 15, 2024 | 6:12 PM

Anasuya Bharadwaj: నటి అనసూయ సోషల్ మీడియాలో తరుచు ట్రోలింగ్స్ గురవుతూ ఉంటుదనే విషయం తెలిసిందే. ఇక ఆమెను ట్రోల్స్ చేసే వారిపై ఘాటుగా కౌంటర్స్ వేయడం ఈమెకు అలవాటు. ఇక ఎప్పటిలానే ఈసారి కూడా అనసూయ పై ఓ నెటిజన్ ట్రోల్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు.  అయితే దీనిపై రియాక్ట్ అవుతూ అనసూయ కూడా ఆమెను ఇలా అవమానించడం కరెక్ట్ కాదు అంటూ ట్వీట్ చేసింది. ఇంతకి ఏం జరిగిందంటే..

Anasuya Bharadwaj: నటి అనసూయ సోషల్ మీడియాలో తరుచు ట్రోలింగ్స్ గురవుతూ ఉంటుదనే విషయం తెలిసిందే. ఇక ఆమెను ట్రోల్స్ చేసే వారిపై ఘాటుగా కౌంటర్స్ వేయడం ఈమెకు అలవాటు. ఇక ఎప్పటిలానే ఈసారి కూడా అనసూయ పై ఓ నెటిజన్ ట్రోల్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు.  అయితే దీనిపై రియాక్ట్ అవుతూ అనసూయ కూడా ఆమెను ఇలా అవమానించడం కరెక్ట్ కాదు అంటూ ట్వీట్ చేసింది. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Jul 15, 2024 | 6:12 PMUpdated Jul 15, 2024 | 6:12 PM
నన్ను విమర్శించిన స్వీకరిస్తా.. ఆమెను మాత్రం అవమానించొద్దు :అనసూయ

బుల్లితెర పై యాంకర్స్ గా కెరీర్ మొదలుపెట్టి వెండితెరపై హీరోయిన్స్ గా, నటిగా ఎంట్రీ ఇచ్చిన వారిలో ‘అనుసూయ భరధ్వాజ్’ కూడా ఒకరు. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయ అవసరం లేదు. బుల్లితెరపై మొదలుపెట్టిన ఈ ప్రయాణం వెండితెరపై స్టార్ నటిగా మారే రేంజ్ కు ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే.. దాదాపు స్టార్ హీరోల అందరీ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ వెండితెరపై అతి తక్కువ కాలంలోనే స్టార్ యాక్టర్ గా గురింపు తెచ్చుకుంది అనుసూయ. అంతేకాకుండా.. ఈమె అందం, అభినయంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. కానీ, నిత్యం వివదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ బ్యూటీ. ముఖ్యంగా ఈమె గ్లామరెస్ డ్రెస్ లతో పాటు ఇతర వివాదాల్లతో తరుచు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతుంది. ఈ మేరకు తాజాగా మరోసారి అనసూయ ట్రలోలింగ్ గురైంది. దీనిపై అనసూయ రియాక్ట్ అవుతూ ఇకపై దేనికి స్పందించకూడదని అనుకున్న కానీ ఇలా చేయడం సరికాదంటూ ట్వీట్ చేసింది. ఇంతకి ఏం జరిగిందంటే..

నటి అనసూయ సోషల్ మీడియాలో తరుచు ట్రోలింగ్స్ గురవుతూ ఉంటుదనే విషయం తెలిసిందే. ఇక ఆమెను ట్రోల్స్ చేసే వారిపై ఘాటుగా కౌంటర్స్ వేయడం ఈమెకు అలవాటు. ఇక ఎప్పటిలానే ఈసారి కూడా అనసూయ పై ఓ నెటిజన్ ట్రోల్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు.  అయితే సదురు నెటిజన్ గతంలో అనసూయ ఓ టీవీ షోల ప్రదర్శన చేసిన వీడియోను ఎక్స్ లో పోస్టు చేసి ట్రోల్ చేశాడు. అయితే దీనిపై అనసూయ రియాక్ట్ అయ్యి ఈ విధంగా రాసుకొచ్చింది. ‘నేను ఇకపై దేనికి స్పందించకూడదని నిర్ణయించుకున్నా. కానీ, నాలుగేళ్ల క్రితం ఒక ఛానెల్ లో జరిగిన ఒక పండుగ కార్యక్రమంలో మహానటి సావిత్రమ్మకు నివాళులు అర్పించా. అయితే నా ప్రదర్శన పట్ల నేను గౌరవంగా భావిస్తున్నా. కానీ, మీరు ఇలా అవమానకరంగా ట్రోల్ చేయడం మంచిది కాదు.

కానీ, ఏదైనా నా గురించి విమర్శలు ట్రోల్స్ చేస్తే నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఇది మహానటి సావిత్రమ్మకు నివాళిని ఉద్దేశించింది. దీనిని ఇలా అగౌరవంగా చేయడం సరికాదు. దయచేసి ఈ ఈవెంట్ లో నా పూర్తి ప్రదర్శనను చూసి ఆపై జడ్జ్‌ చేయమని సూచిస్తున్నాను. కావలంటే.. ఈ ప్రోగ్రామ్ జీ5లో అందుబాటులో ఉంది. ఇక్కడ నా నటన మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కానీ, లెజెండ్ అయినా సావిత్రమ్మ కోసమైనా ఇలాంటి ట్రోల్స్ చేయకండి. ఇక ఎప్పటిలానే నాపై విమర్శలు చేసుకోండి’ అంటూ తనదైన స్టైల్ లో పోస్టు పెట్టింది. కాగా, ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ పోస్టు పై కొందరు అనసూయకు మద్ధతుగా నిలుస్తూ పోస్టు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అనసూయ, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప -2 ది రూల్‌’ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల వస్తున్న విషయం తెలిసిందే. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనసూయ పోస్టు పై మీ అభిప్రాయాలను  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap